వైయ‌స్ జగన్‌తో భేటీపై మోదీ ట్వీట్‌కు అపూర్వ స్పందన

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైయ‌స్‌ జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను’ అని ప్రధాని ఆంగ్లంలో చేసిన ట్వీట్‌ను మంగళవారం నాటికి 64 వేల మంది లైక్‌ చేశారు. 8,600 మంది రీట్వీట్‌ చేశారు. 1,800 మంది కామెంట్‌ చేశారు.

అలాగే తెలుగులో చేసిన ట్వీట్‌ను 48 వేల మంది లైక్‌ చేశారు. 6100 వేల మంది రీట్వీట్‌ చేశారు. 1,500 మంది కామెంట్‌ చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసిన అనంతరం నిశ్చయ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సోమవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు

Back to Top