ఇదా నీ అభివృద్ధి చంద్రబాబూ..?

–అమరావతి కడతానన్నారు..భ్రమరావతి కట్టారు..
వైయస్‌ఆర్‌సీపీ నేత కల్యాణి
రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతికి తెగబడతున్నాడని వైయస్‌ఆర్‌సీపీ నేత కల్యాణి విమర్శించారు.విశాఖ జిల్లా అనకాపల్లి వైయస్‌ జగన్‌ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అమరావతి కడతానన్నారని కాని భ్రమరావతి కట్టారని, సింగపూర్‌ కడతానన్నారు కాని స్మిమింగ్‌పూల్‌ కట్టారని విమర్శించారు. చంద్రబాబుకు కలెక్షన్‌ మీద ఉన్న దృష్టి కన్‌స్ట్రక్షన్‌ మీద లేదన్నారు. సచివాలయానికి ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టకుని వెళ్తున్నారన్నారు.. మోసం చేసే సీనియార్టీ  ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి విలువతో కూడి, నిత్యం పోరాటం చేసే జగనన్న పాలన ఈ రాష్టానికి చాలా అవసరమన్నారు. 
Back to Top