వైయస్‌ జగన్‌తోనే పేదల బతుకుల్లో వెలుగు..

వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అప్పలరాజు..

శ్రీకాకుళంఃప్రజలకు వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకం ప్రజా సంకల్పయాత్రలో  కనిపిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు అన్నారు. జననేత  పాదయాత్రలో ప్రజలను పాల్గొనకుండా చేయడానికి పచ్చనేతలు చాలా ప్రయత్నాలు చేశారన్నారు.రేషన్‌కార్డులు,పెన్షన్‌లు కట్‌ చేస్తామని బెదిరింపులకు సైతం దిగారని ప్రజలు చెప్పారన్నారు.

కాని ప్రజలు వైయస్‌ జగనే మా నాయకుడని బ్రహ్మరథం పట్టారన్నారు.తిత్లీ ప్రభావిత కార్యక్రమాల్లో మహిళలు పెద్దఎత్తున్న పాల్గొని మహిళలు వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారన్నారు.అన్నివర్గాలతో వైయస్‌ జగన్‌ మాట్లాడుతున్నారని,ఏమి చేస్తే మీ బతకులు బాగుపడతాయని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారన్నారు.ఏమిచేస్తే ప్రజలు ఆనందంగా ఉంటారనే అంశాలపై  అధ్యాయనం చేయడం ద్వారా జననేత  రాబోయే రోజుల్లో స్వర్ణయుగం తీసుకురాబోతున్నారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top