చంద్రబాబు కాలు పెడితే బూడిదే


 
–తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఈ విషయం దేశమంతా తెలిసింది.
–2014లో కాంగ్రెస్‌ 24 శాతం, టీడీపీకి 15 శాతం ఓట్లు వచ్చాయి.
–2014లో టీఆర్‌ఎస్‌కు 34 శాతం వచ్చాయి.
–చంద్రబాబు,కాంగ్రెస్‌ కలిస్తే 39 శాతం వస్తాయని కలలు కన్నారు.
–అనైతిక పొత్తుకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు..
–కాంగ్రెస్,టీడీపీ జమ్మిక్కులను ప్రజలు తిప్పికొట్టారు..
–గత జూన్‌లో కాంగ్రెస్‌ చంద్రబాబు చార్జ్‌షీట్‌ విడుదల చేసింది..
–అప్పుడు దుష్టపాలన అన్న కాంగ్రెస్‌ ఇప్పుడు బాబుతో దోస్తీ
–రాహుల్,చంద్రబాబు చెట్టాపట్టాలేసుకుని ఒకే వేదికపై కనిపిస్తున్నారు.
–కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోక ముందు చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో దోస్తీకి ప్లాన్‌ చేశారు..
–హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా కేటీఆర్‌తో పొత్తులపై బేరాలు..
–చంద్రబాబు ఓట్లుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు..
–మా వాళ్లు బ్రీఫ్డ్‌ మీ అన్న చంద్రబాబు మాటలు అందరూ విన్నారు..
–చంద్రబాబు ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు..
–ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఓడించాలని తెలంగాణ ఎన్నికల్లో పిలుపు..
–చంద్రబాబు లాంటి నేతను జనం నమ్మే పరిస్థితి లేదు.
–తెలంగాణ ఎన్నికల్లో పట్టుబడింది డబ్బు రూ.142 కోట్లు
–టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి..
–ఆ డబ్బంతా ఏపీ ప్రజల జేబుల్లోంచి లాగేసిందే..
–కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు
–ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి..
–ప్రభుత్వం భూమి కనబడితే చాలు..కబ్జా చేసేస్తున్నారు.
–వంశధార,నాగావళి అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలు.
–తిత్లీ తుపాను వల్ల రూ.3,435 నష్టమని చంద్రబాబు కేంద్రానికి లేఖ
–బాధితుల కోసం చంద్రబాబు చేసిన ఖర్చు కేవలం రూ.520 కోట్లు.
– రైతులకు పగటి పూట 9 గంటలు ఉచితంగా అందజేస్తాం
– ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి కోసం రూ.12,500 చెల్లిస్తాం
– ప్రతీ రైతుకు ఉచితంగా బోర్లు వేయిస్తాం

శ్రీకాకుళం: భస్మాసురుడు ఎక్కడ చెయ్యి పెట్టినా..చంద్రబాబు ఎక్కడ కాలు పెట్టినా అంతా బూడిదే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబును ఎవరు నమ్మరని తెలంగాణ ఎన్నికల్లో రుజువైందని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు తోడుగా ఉంటామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం ఆమదాల వలస పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
– ఆమదాల వలస ..ఒకప్పుడు ఈ నియోజకవర్గం బౌద్దులు, జౌనులకు దర్శనియ ప్రాంతం.  ఇప్పుడు ఈ నియోజకవర్గం అవినీతికి, ఇసుక దోపిడీకి, నీరు–చెట్టు దోపిడీ, మద్యం దుకాణాల్లోనూ కమీషన్లు పొందడంలో పేరు పొందింది. ప్రజలను వెన్నుపోటు పొడవడం, ఇచ్చిన హామీలను చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే మంచి పేరు సాధించారు. చంద్రబాబు వెన్నుపోటు ఎలా ఉంటుందోనని చెప్పడానికి ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీ. గతంలో చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉన్న కాలంలో దగ్గరుండి ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ నష్టాల బాట పట్టింది. ఏదైనా సీఎం అనే వ్యక్తి సహకార రంగంలోని ఫ్యాక్టరీలను ఆదుకోవాలని ఆలోచన చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గతంలో ఏం చేశారు. నక్కజిత్తులు పన్ని ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీని రూ.6.40 కోట్లకు అమ్మేశారు. రైతులందరూ ఎలా బతకాలనీ కోర్టుకు వెళ్తే ..కోర్టు మద్యంతర ఉత్తర్హులు ఇచ్చింది. అప్పుడు చంద్రబాబు ఏం చేశారో తెలుసా..సుప్రీం కోర్టుకు వెళ్లారు. రైతులకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి..కీడు ఎలా చేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు. నాన్నగారు సీఎం అయ్యాక ఆ కేసును ఉపసంహరించుకున్నారు. 2014లో నాన్నగారు చనిపోయక ఈ ఫ్యాక్టరీ పూర్తిగా ఆధ్వాన్నంగా మారింది. సీఎం అయిన తరువాత చంద్రబాబు మళ్లీ ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాట ఇచ్చారు. ఆయనే దగ్గరుండి మూత వేయించారు. సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. మళ్లీ 2014లో మాట ఇచ్చారు. తీరా చేశారా అని చూస్తే..ఇంతవరకు లేదు. చంద్రబాబుకు మోసం చేయడం కొత్తమే కాదు. ఇవాళ ఇదే పెద్ద మనిషి ఏమంటారో తెలుసా? చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడం అన్నది ముగిసిన అధ్యాయం అన్నారు. దీన్ని ఎలా అమ్మాలని దిక్కుమాలిన ఆలోచన చేశారు. 
– ప్రతి రైతుకు మాట ఇచ్చి చెబుతున్నాను. ఆరోజు నాన్నగారి పాలన చూశారు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వ స్తుంది. అక్కడే చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాట ఇస్తున్నాను. 
–ఈ నియోజకవర్గంలో ప్రజలు అంటున్న మాటలు..అన్నా..అవినీతిలో చంద్రబాబు డాన్‌ అయితే..ఆయన అవినీతి సామ్రాజ్యంలో ఇక్కడి ఎమ్మెల్యే ఓ చోటా డాన్‌ అంటున్నారు. ఎరగాం, కాకాండియాం, ముద్దాయిపేట, సింగూరు. దోషి, తోటాడ, పురుషోత్తంపురం ఇసుక రీచ్‌లు, రెండు నదులను వదిలిపెట్టలేదు. ఇక్కడ దాదాపుగా రూ.300 కోట్ల దాదకా దోచుకున్నారు. దోచుకున్న లూటీని ఎమ్మెల్యే నుంచి కలెక్టర్, చిన్నబాబు, ఏకంగా పెద్దబాబు దాకా వెళ్తున్నాయి. అధికారులు ఎవరూ కూడా ఈ దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. కళ్ల ఎదుటే జేసీబీలతో తవ్వుతూ ఇసుక తరలిస్తున్నా..ఎవరు అడ్డుకోవడం లేదు. బయటప్రపంచానికి దోపిడీని చూపించడానికి మన వంశధార నదే ఉగ్రరూపం దాల్చింది. పురుషోత్తంపట్నం ఇసుక రీచ్‌ వద్ద లారీలు, జేపీబీలు నీట మునిగాయి.  లూటీ చేసిన వారిపై ఎలాంటి శిక్షలు లేవు.
– ఇక్కడ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయంటే..కాన్‌కాస్ట్రు అనే పెరాలాయిస్‌ కంపెనీలో ఏకంగా 800 మంది పని చేస్తున్నారు. టీడీపీ నేతల వసూళ్లు భరించలేక మూత వేసుకొని పారిపోయారు. కొత్త ఉద్యోగాల కథ దేవుడెరుగు..ఉన్నవి కూడా మూతపడుతున్నాయి.
– అన్నా..మా ఎమ్మెల్యేకు ఎక్కడైనా ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు తన కళ్లు ఆగవన్నా అంటున్నారు. వెంటనే కబ్జా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. వెన్నలవలస గ్రామంలో ప్రభుత్వ భూమి 200 ఎకరాలు ఉంది. ప్రభుత్వ కాలేజీకి భూమి ఇవ్వమంటే ఇవ్వరూ. కానీ ఎమ్మెల్యే భార్య పూలసాగు చేసేందుకు అర్జి పెట్టుకోవడం ఆలస్యం లేదు. వెంటనే మంజూరు చేశారు. దీనిపై వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన చేయాల్సి వచ్చింది. పోలీసు స్టేషన్‌ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొట్టేసి టీడీపీ కార్యాలయాన్ని కట్టేశారు.
– వంశధార, నాగవళికి సంబంధించి..వంశధార నీటిని హైలెవల్‌ కెనాల్‌ ద్వారా నారాయణాపురం నుంచి నీటిని ఇవ్వాలని భావించారు. ఇవాల్టికి ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే హీరా మండలంలోని రిజర్వాయర్‌ వద్ద నుంచి అన్ని పనులు కూడా నాన్నగారి హాయంలో యుద్ధప్రాతిపాదికన చేయించారు. అటువంటి రిజర్వాయర్‌ను నాన్నగారు కట్టించారు కాబట్టి..అక్కడి నుంచి కాల్వ తవ్వించి దానికి హైలెవల్‌ కాల్వ తవ్వి వంశధార–నాగావళి అనుసంధానం చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ రోజు కూడా తట్టెడు మట్టి కూడా ఏ ప్రాజెక్టులో కూడా తీయలేదు.  
– తిత్లీ తుపాన్‌ వల్ల రూ.3435 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు..ఆయన కేటాయించింది కేవలం రూ.520 కోట్లు మాత్రమే. అందులో ఖర్చు చేసింది రూ.250 కోట్లు మాత్రమే. చంద్రబాబు çవ్యవహార శైలి ఎలా ఉందంటే శవాలపై చిల్లర వేరుకున్నట్లుగా ఉంది. 
– ఈ నియోజకవర్గంలోని సమస్యలే కాదు..చంద్రబాబు వ్యవహార శైలిని ఒక్కసారి చూస్తే నివ్వెరపోతాం. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ఎన్నికలు చూశాం. చంద్రబాబుకు ఉన్న ఎల్లోమీ డియా సామ్రాజ్యం ఎంతగా ప్రచారం చేసిందంటే..ఏ స్థాయిలో యుద్ధాన్ని చూపించారంటే..నిజంగా ఏమేమో జరిగిపోతుందని చూపించారు. పరీక్షలు రాయకముందు విఫరీతంగా డ్రామాలాడారు. ఫలితాలు వచ్చాక ఏం జరిగిందంటే..భష్మసురుడు చెయ్యి పెట్టినా..చంద్రబాబు కాలు పెట్టినా అంతా బూడిదే. తెలంగాణ ఎన్నికలతో చంద్రబాబు గురించి దేశానికి మొత్తం తెలిసిపోయింది. 2014లో కాంగ్రెస్‌కు 14 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి కూడా 14 శాతం వచ్చాయి. రెండు కలిపితే 28 శాతం వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరికి కలిపి 5 శాతం ముందంజలో ఉండి ఎన్నికలకు వెళ్తే..ప్రజలు అనైతిక పొత్తును ఛీకొట్టారు. ఎవరైనా ఓటు వేసేటప్పుడు ఆలోచిస్తారు. ప్రజలు ఏం చెప్పినా వింటారని అబద్ధాలు చెబితే నమ్ముతారు అనుకునే చంద్రబాబు వంటి నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ పక్కన చంద్రబాబు కనిపించారు. జూన్‌ 8, 2018లో చంద్రబాబు పాలన గురించి ఇదే కాంగ్రెస్‌ పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. చంద్రబాబు పేరుతో చార్జిషిట్‌ అన్న పుస్తకాన్ని విడుదల చేసింది. ఐదు నెలల తరువాత కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి అన్యాయమైన పాలనను నమ్మి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు. ఇదే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకముందు..తన సొంత బావమరిది హరికృష్ణ చనిపోయారు. అక్టోబర్‌ చివర్లో హరికృష్ణ చనిపోతే..ఆయన బౌతికకాయం సాక్షిగా చంద్రబాబు కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌తో పొత్తుల కోసం బేరాలాడారు. టీఆర్‌ఎస్‌ వాళ్లే మీతో పొత్తు పెట్టుకోమని చెప్పారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎంత సిగ్గు లేనోడంటే..అసెంబ్లీలో చంద్రబాబు ఏమన్నారంటే టీఆర్‌ఎస్‌తో పొత్తును నరేంద్ర మోడీ అడ్డుకున్నారని అన్నారు. మళ్లీ సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో జత కట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టిన ఇదే కాంగ్రెస్‌ పార్టీతో సిగ్గు లేకుండా జత కట్టారు. ఇంతగా ఊసరవెళ్లి కంటే వేగంగా రంగులు మార్చుతుంటే ఎవరయ్యా..నిన్ను నమ్మి నీ పార్టీకి ఓట్లు వేస్తారని అడుగుతున్నాను. 
– రాష్ట్రంలో దోచుకున్న అవినీతితో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు. అంతటితో ఆగిపోకుండా..వాళ్లలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసి ఆడియో, వీడియో టేపులతో అడ్డగోలుగా దొరికిపోయారు. మన వాళ్లు బ్రీఫ్డ్‌ మీ.. అన్నారు. అంత తెలిసి కూడా మళ్లీ తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఏమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ద్రోహులు, చరిత్రహీనులు, చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీలో అడ్డగోలుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్ర ఉన్న నీవు..ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడటం నిజంగా ఒక మనిషి ఇంతలా సిగ్గు, శరం లేకుండా, నీతి, న్యాయం లేకుండా మాట్లాడుతుంటే..ఎవరైనా నమ్మి ఓట్లు వేస్తారా?
– ఇదే పెద్ద మనిషి తెలంగాణలో మాట్లాడిన మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. మొన్ననే రాష్ట్రం విడిపోయింది. అక్కడ ఎవరు ఏం చేశారో అందరికి తెలుసు. కానీ రింగ్‌ రోడ్డు, పీపీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌ హైవే, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నేనే కట్టానని చెప్పారు.
– ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి చిలుకా గోరింకల మాదిరిగా సంసారం చేశారు. అసెంబ్లీలో తీర్మానాలు చేసి మరి పొగిడారు. ఎన్నికల హామీలు, విభజన హామీలు నెరవేర్చకపోయినా ఎప్పుడు కూడా బీజేపీని చంద్రబాబు విమర్శించలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బీజేపీకి విడాకులు ఇచ్చిన తరువాత..తానేదో ఎప్పటి నుంచి బీజేపీ నుంచి యుద్ధం చేస్తున్నట్లు డ్రామాలు. ఇన్ని విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని చంద్రబాబుకు తెలుసు. కేవలం ఎన్నికలకు కేవలం 36 గంటలకు ముందు తాను ఏమి చెబితే అవి ఎల్లోమీడియా చెబుతుంది. లగడపాటిని తీసుకొచ్చారు. ఆయన ఒక పెద్ద రాజకీయ విశ్లేషకుడని, ఆయనకు ఆక్టోపస్‌ అని పేరు పెట్టారు. చంద్రబాబు కూటమి ఎన్నికల్లో సిప్‌ చేస్తుందని చెప్పాడు. తన ఎల్లోమీడియా ఎంతగా పబ్లిషిటి ఇచ్చారో చూశాం. చంద్రబాబు ప్రభుత్వం వస్తుందని ఊదరగొట్టారు. దొంగ సర్వేలు  ఇప్పించారు. పోలింగ్‌ జరుగుతున్న రోజే మధ్యాహ్నానికి ఒక ఫేక్‌ ఎక్జిట్‌ పోల్‌ తీసుకువచ్చారు. ప్రతి సెల్‌ ఫోన్‌కు మేసెజ్‌లు పంపించారు. తెలంగాణలో పట్టుబడిన డబ్బు ఎంతో తెలుసా?  అక్షరాల 140.60 కోట్లు పట్టుబట్టాయి. ఆ డబ్బంతా ఎవరిదో తెలుసా..మన జేబుల్లో నుంచి దోచుకున్న సొమ్మే . ఎన్నికల్లో ఈయనను నమ్మి ప్రజలు ఓట్లు వేయాలట. 
– నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనను చూశారు. ఇంతకన్న ఘోరమైన పాలన ఎక్కడైనా ఉందా? రైతులకు సాగునీరు లేదు. సున్నా వడ్డీకి రుణాలు అందడం లేదు. గిట్టుబాటు ధరలు లేవు. మద్దతుధరకు కొనే నాథుడు లేడు. రాష్ట్రవ్యాప్తంగా కరువుతో 11 జిల్లాలు అల్లాడుతుంటే..ఆదుకోవాల్సిన చంద్రబాబు ఇంతవరకు డమ్మిడి కూడా సాయం చేయలేదు. ఇంతటి అన్యాయం చేసే చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా?
– ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మాట చెప్పారు. ఇవాళ చేసింది ఏమిటి ఎన్నికలకు మూడు నెలల ముందు అది కూడా కోటి డెబ్బై లక్షల ఇల్లు ఉంటే కేవలం మూడు లక్షల మందికి కేవలం రూ.1000 నిరుద్యోగ భృతి చెల్లించారు. తెలంగాణ సభలో ఆయన ఏమన్నారు..నిరుద్యోగ భృతితో ప్రజలంతా సుఖంగా ఉన్నారని చెప్పారు. రైతులకు రుణమాఫి పేరుతో నామం పెట్టారు. పొదుపు మహిళలను దగా చేశారు. సున్నా వడ్డీలు, పావలా వడ్డీలు ఎగ్గొటి సున్నం రాశారు. 
– గతంలో చంద్రబాబు సీఎం కాకముందు రేషన్‌షాపుల్లో బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, పామాయిల్, గోదుమ పిండి, కారం, పసుపు, చింతపండు ఇచ్చే వారు. ఇప్పుడు బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజులు బాదుడే బాదుడు. ఖాళీగా ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు టీడీపీ నేతల కన్ను పడుతోంది. చంద్రబాబు హయాంలో చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దక్కడం లేదు. ఫీజులు చెల్లించలేక చదువులు మానేస్తున్నారు. ఇల్లు అమ్ముకుంటే తప్ప పిల్లలను చదివించలేని పరిస్థితి. చంద్రబాబు మాత్రం ఏమంటారు. తనకు బీసీలపై ప్రేమ అంటున్నారు. చంద్రబాబు నాలుగు కత్తెర్లు ఇస్తే బీసీలపై ప్రేమ కాదు. బీసీలపై ప్రేమంటే ఎలా ఉంటుందో ఒక్కసారి నాన్నగారి పాలన చూడండి. 
– ఆరోగ్యశ్రీలో ఇవాళ వైద్యం చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. విశాఖలోని కేజీహెచ్‌లో మంచానికి ఇద్దరు కనిపిస్తారు. 108 అంబులెన్స్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. 
– రాష్ట్రంలో నాలుగేళ్లుగా సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగులు అడుగుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో చంద్రబాబు ఏమంటున్నారు..అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తామని అంటున్నారు. ఇక్కడ ఏది కావాలన్నా లంచం అడుగుతున్నారు. ఇవాళ పింఛన్ల గురించి చెప్పాల్సి వస్తే..పొందూరు మండలంలో దాదాపు 850 మందికి సంబంధించిన పింఛన్లు తొలగించారు. బాధితులు కోర్టుకు వెళ్తే..చంద్రబాబుకు కోర్టు మెట్టికాయాలు వేసింది. అవ్వలమ్మ అనే మహిళ కోర్టుకు వెళ్లి అయ్యా..నేను బతికే ఉన్నానని జడ్జిని కోరింది. మరో అమ్మ తన భర్త చనిపోతే..బతికే ఉన్నాడని పింఛన్‌ తొలగించారు. 
– చంద్రబాబు గ్రామ గ్రామంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫీయా తయారు చేశారు. వీధి వీధిలో బడి పక్కన, గుడి పక్కన మద్యం షాపులు ఏర్పాటు చేశారు. సీఎం అయిన తరువాత చేసిన మొదటి సంతకంలో బెల్టుషాపుల రద్దు ఫైల్‌ ఉంది. కానీ ఇప్పుడు గ్రామంలో నాలుగైదు షాపులు కనిపిస్తున్నాయి. ఇలాంటి అన్యాయమైన పాలన పోవాలి. రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. ఇవాళ రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే జగన్‌ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు, ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పువ స్తుంది.
– రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తానన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే లక్ష్యం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఆదుకుంటాను. ప్రతి పంటకు ముందుగానే మద్దతు ధర ప్రకటిస్తాం. ఉచితంగా పగటి పూట 9 గంటలు ఇస్తాం. రైతులకు సున్నా వడ్డీలు రుణాలు ఇప్పిస్తాం. రైతులకు పెట్టుబడి నిధి కింద ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 చెల్లిస్తాం. పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. రూ.3 వేల కోట్లతో పెట్టుబడి నిధి ఏర్పాటు చేస్తాం. రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరిత్యాల నిధి  ఏర్పాటు చేస్తాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం. పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తాం. ప్రతి లీటర్‌కు రూ.4 ఇచ్చి ఆదుకుంటాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీలు రద్దు చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తోడుగా ఉండేందుకు వైయస్‌ఆర్‌ బీమా పథకం తీసుకొచ్చి వెంటనే రూ.5 లక్షల పరిహారం అందజేస్తాం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆడపడుచు ఆస్తి కోసం ఇస్తున్నట్లు చట్టం తెస్తాం. ముఖ్యమంత్రి స్థానంలో నా కొడుకు ఉన్నాడు అన్న ధీమా కల్పిస్తాం. ఇందులో కూడా ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా ఉండమని కోరుతూ..ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..
 
Back to Top