అనంతపురం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరి కాసేపట్లో శింగనమల మండలం మార్తాడు గ్రామానికి చేరుకోనున్నారు. శనివారం ఉదయం పాపినేని పాలెం నుంచి పాదయాత్రను ప్రారంభం కాగా అక్కడ నుంచి జంబులదిన్నె తండా, గార్లదిన్నెకు చేరుకున్న వైయస్ జగన్ మధ్యాహ్నం బీసీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం గార్లదిన్నె గ్రామంలో వైయస్ జగన్ పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి మార్తాడుకు బయలుదేరారు. <br/>