గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రగా వస్తుండటంతో చిలుకలూరి పేట పట్టణం కిక్కిరిసిపోయింది. కాసేపట్లో కళామందిర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. వేలాది మంది తరలిరావడంతో పట్టణం జనసంద్రమైంది.