విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 245వ రోజు శనివారం రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర కొత్తపాలెం క్రాస్ శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి నారాయణపురం, మామిడివాడ మీదుగా గోకివాడ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైయస్ జగన్ లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. పంచదార్ల, అప్పరాయడు పాలెం మీదుగా ధారభోగాపురం వరకు వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. <br/>