<br/>కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్ కిరవడి, గాజులదిన్నె క్రాస్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభం అవుతుంది. గోనెగొండ్లలో పార్టీ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. 6.30 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర ముగయనుంది. రాత్రికి ఆయన గోనెగండ్లలోనే బస చేస్తారు.<br/><br/>