విజ‌య‌న‌గ‌రంలో విజ‌య‌వంతం
- రేప‌టి నుంచి శ్రీ‌కాకుళం జిల్లాలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 36 రోజుల పాద‌యాత్ర‌
- 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో 311.5 కిలోమీట‌ర్లు
- రాజ‌న్న బిడ్డ‌కు బాధ‌లు చెప్పుకున్న జిల్లా ప్ర‌జ‌లు

విజ‌య‌న‌గ‌రం:  సడలని సంకల్పం, ఒడిదుడుకులను లెక్క చేయని పట్టుదల, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలనే ఆకాంక్ష జననేత వైయ‌స్‌ జగన్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు 12 జిల్లాల‌లో పూర్తి అయి.రేప‌టి నుంచి చివ‌రి జిల్లా శ్రీ‌కాకుళంలోకి ప్ర‌వేశిస్తోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌న‌నేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంత‌మైంది. రాజ‌న్న బిడ్డ‌కు జిల్లా వాసులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. త‌మ‌ను పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గోడు వెల్ల‌బోసుకున్నారు.  అశేష ప్రజానీకం అపూర్వ  ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగింది. వెల్లువెత్తిన జన నీరాజనాలు, పోటెత్తిన మహిళల హారతులు, వృద్ధుల ఆశీర్వాదాలు, యువకుల కేరింతల నడుమ జిల్లాలో పాద‌యాత్ర పూర్తి చేశారు. విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జననేత 24వ తేదీ  విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం చింతలపాలెంకు చేరుకోగానే వైయ‌స్ఆర్‌ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అదే రోజు దేశ‌పాత్రునిపాలెం వ‌ద్ద 3 వేల కిలోమీట‌ర్ల మైలు రాయిని వైయ‌స్ జ‌గ‌న్ అధిగ‌మించారు.  3100 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద‌, అలాగే 3200 కిలోమీట‌ర్లు సాలురు నియోజ‌క‌వ‌ర్గంలోని బాగు వ‌ల‌స వ‌ద్ద, 3300 కిలోమీట‌ర్లు కురుపాం నియోజ‌క‌వ‌ర్గంలో అధిగ‌మించారు. రేప‌టితో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి అవుతుంది. రేపు సాయంత్రం శ్రీ‌కాకుళం జిల్లాలోకి రాజ‌న్న బిడ్డ అడుగుపెడ‌తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా న‌వంబ‌ర్ 18వ తేదీ 300వ రోజు మైలు రాయిని పూర్తి చేశారు. అనేక మైలురాళ్లు దాటి...
వైయ‌స్ఆర్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయలో ప్రారంభమైన వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఇప్పటికే పలు మైలు రాళ్లను దాటింది. సెప్టెంబర్‌ 24న విజయనగరం జిల్లాలో అడుగిడిన రోజే ఎస్‌కోట నియోజకవర్గంలోని కొత్తవలసలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. గుర్ల మండలం ఆనందపురం క్రాస్‌ వద్ద 3100 కిలోమీటర్లు, సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు. ఈ నెల 18వ తేదీ పాదయాత్ర ప్రారంభించి 300 రోజులు పూర్తి చేసుకోవటం ద్వారా మరో నూతన రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 124 నియోజకవర్గాలు, 8 కార్పొరేషన్‌లలో పర్యటించిన జగన్‌ 114 బహిరంగ సభలు, సమావేశాలతో పాటు 42 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 36 రోజుల పాటు 311.5 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర సాగింది. 9 నియోజ‌క‌వ‌ర్గాలు, 18 మండ‌లాలు, 214 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీల‌లో జ‌న‌నేత ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగింది. 9 ప్రాంతాల్లో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు.  
Back to Top