మ‌రో కీల‌క‌ ఘట్టం

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 3600 కిలోమీట‌ర్లు

వైయ‌స్ జగన్ పాదయాత్రలో మరో మైలు రాయి

శ్రీ‌కాకుళం జిల్లా బారువ జంక్ష‌న్‌లో జెండా ఆవిష్క‌ర‌ణ‌

శ్రీ‌కాకుళం:  ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో శ‌నివారం మరో కీల‌క ఘట్టం ఆవిష్కృతమైంది.
ప్రజాసంకల్పయాత్ర 3600 కిలోమీట‌ర్ల మైలురాయిని శ్రీ‌కాకుళం జిల్లా బారువా జంక్ష‌న్ వ‌ద్ద దాటింది. అశేష జనవాహిని వెంటనడువగా...  3600 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు.  ఈ సందర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన జెండాను వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించి, మొక్క‌ను నాటారు. 2017 న‌వంబ‌ర్ 6న ఇడుపులపాయ నుంచి  వైయ‌స్‌ జ‌గ‌న్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 12 జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకొని చివ‌రి జిల్లా శ్రీ‌కాకుళంలో కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం చివ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. ఈ నెల 9వ తేదీ ఇచ్చాపురం వ‌ద్ద పాద‌యాత్ర ముగియ‌నుంది.  జననేత త‌మ ప్రాంతానికి వస్తున్నారని పార్టీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో బారువా జంక్ష‌న్ జనసంద్రంతో నిండిపోయింది.   

జ‌న‌నేత‌కు జేజేలు..కాబోయే సీఎం జిందాబాద్‌
వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 3600 కిలోమీట‌ర్లు పూర్తి అయిన సంద‌ర్భంగా స్థానికులు జ‌న‌నేత‌కు జేజేలు కొట్టారు. కాబోయే సీఎం జిందాబాద్ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. జగన్‌ సీఎం అయితేనే అందరి కష్టాలు తీరతాయని ఆకాంక్షించారు. ‘అన్నా.. నాలుగున్నరేళ్లుగా కష్టాలే.. అడుగడుగునా వేధింపులే.. ఇక భరించలేం.. మేమంతా మీ వెంటే.. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపుతాం..’ అంటూ మహిళలు, యువత బహిరంగంగా శపథం చేయడం కనిపించింది.

మన బాగు కోసం రాజన్న బిడ్డ నడుచుకుంటూ వస్తున్నాడని అవ్వాతాతలు ఓపికతో ఎదురు చూస్తుండటమూ కనిపించింది. ఇన్నాళ్లూ మోసపోయాం.. మీరే మా నాయకుడంటూ జగన్‌ను తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుని కష్టాలు ఏకరువు పెట్టడం.. వారందరికీ జగన్‌ ధైర్యం చెప్పడమూ చూశాం. దారిపొడవునా జగన్‌ అందరి కష్టాలు ఓపికతో విని ధైర్యం చెబుతూ, భవిష్యత్తుపై భరోసా ఇస్తున్న తీరు ‘లీడర్‌ అంటే ఇలా ఉండాలి’ అనేలా చేసింది. పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వారి చేష్టలే చెప్పకనే చెబుతున్నాయి.   3,600 కి.మీ అధిగమించి చారిత్రక ఘట్టానికి వేదికైన బారువా జంక్ష‌న్ వ‌ద్ద వైయ‌స్ జగన్‌కు జనం ఘన స్వాగతం పలికారు.    

కిలోమీటర్ల వారీగా పాదయాత్రలో ఘట్టాలు
3600 కిలోమీట‌ర్లు శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గం బారువా జంక్ష‌న్‌(05 జ‌న‌వ‌రి, 2019)
 3500 కిలోమీట‌ర్లు  శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం రావివ‌ల‌స‌(23డిసెంబ‌ర్‌. 2018)
3400 కిలోమీట‌ర్లు శ్రీ‌కాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ఎచ్చెర్ల స‌మీపం(06 డిసెంబ‌ర్‌, 2018)
3300 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నియోజ‌క‌వ‌ర్గం జియ్య‌మ్మ‌వ‌ల‌స మండ‌లం(24. న‌వంబ‌ర్‌, 2018)
3200 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలురు నియోజ‌క‌వ‌ర్గం బాగువ‌ల‌స‌(అక్టోబ‌ర్‌24, 2018)
3100 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురం క్రాస్ (అక్టోబ‌ర్,8,2018)
3000 కిలోమీట‌ర్లు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్‌. కోట నియోజ‌క‌వ‌ర్గంలోని దేశ‌పాత్రునిపాలెం(సెప్టెంబ‌ర్‌24, 2018) 
2900 కిలోమీట‌ర్లు విశాఖ జిల్లా స‌బ్బ‌వ‌రం (సెప్టెంబ‌ర్ 5, 2018)
2800 కిలోమీట‌ర్లు విశాఖ జిల్లా యలమంచిలి (ఆగ‌స్టు 24, 2018)
2700 కిలోమీట‌ర్లు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం (ఆగ‌స్టు11, 2018)
2600 కిలోమీట‌ర్లు తూర్పు గోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌( జులై 8, 2018)
2500 కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పులసపూడి వంతెన వద్ద (జులై 8, 2018)
2400 కిలోమీట‌ర్లు తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం ల‌క్క‌వ‌రం క్రాస్ వ‌ద్ద (జూన్ 21, 2018)
2300 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు ‍క్రాస్‌ రోడ్డు వద్ద  2300 కిలోమీటర్లు(జూన్ 11, 2018).
2200 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర (మే 30,2018)
2100 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర(మే 22,2018)
2000 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14,2018)
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7,2018)
1600-గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ 24, 2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
0 - వైయ‌స్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017)

ప్రజాసంకల్పయాత్ర అంకెల్లో:
పాదయాత్ర వివరాలు : ( జవరి 9 వరకూ):
మొత్తం పాదయాత్ర జరిగిన రోజులు : 341
మొత్తం దూరం : 3,648 కిలోమీటర్లు ( కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దూరం)
పాదయాత్ర నియోజకవర్గాలు : 134
పాదయాత్ర సాగిన మొత్తం గ్రామాలు : 2,516
పాదయాత్ర సాగిన మండలాలు: 231
పాదయాత్ర సాగిన మున్సిపాల్టీలు: 54
పాదయాత్ర సాగిన కార్పొరేషన్లు : 8
బహిరంగ సమావేశాలు : 124
ఆత్మీయ సమ్మేళనాలు  : 55
   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top