చంద్రబాబు జీవితంలో సాధించింది ఒక్కటీ లేదు



– టెక్కలి నుంచి 1994లో ఎన్టీఆర్‌ను గెలిపించారు
– అలాంటి ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
– అచ్చెన్నాయుడు తాటిచెట్టంత ఎత్తున్నా..ఈతకాయంత మేలు చేయలేదు
– ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి గోడౌన్లు కట్టుకున్నారని ప్రజలు చెబుతున్నారు.
– కొత్త క్వారీలకు లైసెన్స్‌ ఇవ్వాలంటే మంత్రికి రూ.25 లక్షలు లంచం ఇవ్వాలట
– బాబు పాలనలో చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి
– మహేంద్ర తనయ రిజర్వాయర్‌ పనుల్ని వైయస్‌ఆర్‌ ప్రారంభించారు.
–ఊర్లో లేని పేర్లతో తిత్లీ తుపాను పరిహారం కొల్లగొట్టారు.
– తుపాను బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదు
– ఎవరైనా పరిహారం అడిగితే తోకలు కత్తరిస్తానని చంద్రబాబు బెదరింపులు
– తుపాను కారణంగా రూ.3435 కోట్ల నష్టం జరిగితే బాబు ఇచ్చింది రూ.350 కోట్లే
– పెథాయ్‌ తుపానును చంద్రబాబు ఓడించారట
– సముద్రాన్ని కంట్రోల్‌ చేశారట
– బాబు ఆలోచనంతా పెథాయ్‌ తుపాన్‌ను పబ్లిసిటీకి ఎలా వాడుకోవాలనే
– చంద్రబాబు చేసింది ఒక్కటే ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడవటం
– ఆర్టీజీఎస్‌ పెద్ద బోగస్‌ అని మంత్రి లేఖ రాసిన సంగతి తెలియదా బాబూ?
– కరెంటు, పెట్రోల్‌ చార్జీల బాదుడు ఆర్టీజీఎస్‌లో కనిపించడం లేదా?
– కేసుల కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో బాబు జత కడుతారు
– రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటే అది చంద్రబాబు వల్లే
– బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను నమ్మొద్దు
– ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం పెట్టిన వారికే కేంద్రంలో మద్దతు
– వైయస్‌ఆర్‌ చదువుల విప్లవం తీసుకువస్తాం
– పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు 
– బాబు మూసేసిన ప్రతి బడిని తెరిపిస్తాం
– సీపీఎస్‌ విధానం రద్దు చేస్తాం
– మెగా డీఎస్సీ పెట్టి ఉద్యోగాల భర్తీ
 
శ్రీకాకుళం: చంద్రబాబు తన జీవితంలో చేసింది..సాధించింది ఒక్కటీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. సముద్రాన్ని కట్టడి చేశానని, తుపాన్లను జయించానని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉంటూ తన నియోజకవర్గంలో పరిశ్రమలు మూతపడితే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దోచుకోవడం..దాచుకోవడమే టీడీపీ నేతల పని అని విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక వైయస్‌ఆర్‌ చదువుల విప్లవం తెస్తామని, పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

–ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టగానే..టెక్కలి గత చరిత్రలోకి వెళ్లాలి. ఇదే నియోజకవర్గం నుంచి 1994వ సంవత్సరంలో అప్పట్లో స్వర్గీయ ఎన్‌టీ రామారావును ఇక్కడి నుంచి గెలిపించారు. అదే సంవత్సరంలో జరిగింది ఏంటో అందరికీ తెలుసు. సొంత కూతురును ఇచ్చిన మామ ఎన్‌టీ రామారావునువెనకాల నుంచి పొడిచిన వ్యక్తి ఎవరో తెలుసా? అదే చంద్రబాబు ఇవాళ..రాష్ట్రాన్ని, ప్రజలను ఆరోజు నుంచి ఈ రోజు వరకు పొడుస్తునే ఉన్నారు.
అదే చంద్రబాబు కొలువులో ఇక్కడి నుంచి ఎన్నుకోబడిన మన మంత్రి అవినీతి విశ్వ స్వరూపం మనందరికి తెలుసు. ఆయనకు ఈ పేరు కూడా ఇక్కడి నుంచే వచ్చిందని చెబుతున్నారు. అన్నా..మా మంత్రి తాటిచెట్టు అంత ఎత్తు ఎదిగాడు గానీ..ప్రజలకు మాత్రం ఈతకాయంత మేలు చేయలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ మంత్రి గారి పేరు అచ్చెంనాయుడు. అన్నా..ఆముదాలవలస, ఇచ్చాపురంలో జరిగే ఇసుక దందాకు మా మంత్రి బిగ్‌బాస్‌ అంటున్నారు. ఇక్కడి నుంచి లంచాలు చిన్నబాబు నుంచి పెద్దబాబు దాకా ఈ మంత్రే చేరవేస్తారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్‌ పని జరిగినా కూడా ఆ పనుల్లో మంత్రి తమ్ముడు హరిప్రసాద్‌ కనిపిస్తారని చెబుతున్నారు.
– అవినీతికి సీతాసాగరం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎకరా ఐదు కోట్లు చేసే టెక్కలి ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా మంత్రి దగ్గరుండి తన బినామీకి ఇప్పించుకున్నారని చెబుతున్నారు.
– అన్నా..టెక్కలిలో కార్పొరేషన్ల ద్వారా వచ్చే అరకొర డబ్బుల్లో కూడా కమీషన్లు దండుకుంటున్నారని ఈ మంత్రి గురించి చెబుతున్నారు. చివరకు మరుగుదొడ్ల మంజూరుకు లంచాలు ఇవ్వాల్సిందే ..అంగన్‌వాడీ పోస్టులను అమ్ముకుంటున్నారని చెబుతున్నారు.  ఇదే నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నారని కోటబొమ్మలి మండలం యలమంచలి సహా ఏకంగా 15 మంది పింఛన్లు కట్‌ చేస్తే..బా«ధితులంతా కోర్టుకు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చింది. 26 మంది వైయస్‌ఆర్‌సీపీ సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రద్దు చేసిన ఘనత ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తుంది.
– మంత్రి కాగానే దళిత మహిళ చిన్న కిరణాకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తుంటే బుల్డోజర్‌ పెట్టి తొక్కించారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇదే పెద్ద మనిషి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గోడౌన్లు కట్టించుకున్నారు. ఇదే పెద్ద మనిషి ఏడాదికి రూ.3 కోట్ల బియ్యం సహా చేస్తున్నారని చెబుతున్నారు.
– మంత్రిగా ఉండి ఈ పెద్ద మనిషి చేస్తున్నది ఏంటంటే..ఇదే నియోజకవర్గంలో 75 క్వారీలు, పాలీష్‌యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ కొత్త క్వారీలకు ఎల్‌వోసీలు ఇవ్వాలంటే లంచాలు ఇవ్వాల్సిందే. మంత్రి గారి కంపెనీ భవానీ గ్రైనైట్‌కు ప్రతి గ్రైనెట్‌ కంపెనీ నుంచి పంపించకపోతే ఊరుకోరని చెబుతున్నారు.
– గతంలో సీనరేజ్‌ ఫీజు ఏకంగా రూ.2900లకు పెంచారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అన్నా మా ప్రాంతాల్లో ఉద్యోగాలు రావాలంటే ఇటువంటి గ్రైనైట్‌ యూనిట్లు ముందడుగు వేయకపోతే ఎలా బతుకుతామని అంటున్నారు. చంద్రబాబు నోరు లె రిస్తే చాలు సింగపూర్, జపాన్‌ అంటున్నారు. ఇక్కడున్న గ్రైనైట్‌ యూనిట్లు మూతపడుతున్నాయని చెబుతున్నారు. గతంలో పాలీష్‌ యూనిట్లకు కరెంటు రేటు రూ.3.10 ఉంటే..ఇప్పుడు యూనిట్‌కు రూ. 8 చొప్పున లాగుతున్నారు.
– ఇవాళ మెట్‌కోర్‌ ఫ్యాక్టరీ బాధితులు ధర్నా చేస్తూ కనిపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక అచ్చెన్నాయుడిని మంత్రిని చేశారు. ఇక్కడ 2017లో ఫ్యాక్టరీ మూతపడితే..అక్కడ కార్మికులు ధర్నా చేస్తుంటే అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉండి కూడా జీతాలు ఇప్పించకుండా యాజమాన్యంతో కుమ్మక్కై అక్కడి మెటిరీయల్‌ అమ్ముకునేలా చేశారని కార్మికులు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున బకాయిలు ఉన్నా..పట్టించుకోవడం లేదు.
– టెక్కలి, నందిగామా, పలాసా మండలాల్లోని 108 గ్రామాల్లో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లతో మహేంద్ర తనయ ప్రాజెక్టుకు 2008లో పనులు ప్రారంభించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా లంచాలు ఎలా తినాలో అని ఆలోచన చేసి అంచనాలు పెంచి దోచేసే పనులు చేస్తున్నారు. కానీ పనులు ముందుకు సాగడం లేదు.
– కాకార పల్లి పవర్‌ ప్లాంట్‌ను ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఆ ప్రాజెక్టును రద్దు చేస్తామన్నారు. 51 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలుసు. మత్స్యకారులు అన్యాయమై పోతారని తెలిసి కూడా ..సీఎం అయ్యాక అక్కడ రెండు ప్రాజెక్టులు కట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ప్రాజెక్టును రద్దు చేయాలని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
– ఎవరైనా పరిశ్రమలు రావాలని ప్రజలు భావిస్తారు. భావనపాడు ప్రాజెక్టు కావాలని కోరుతున్నారు. చంద్రబాబు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అక్కడి ప్రజలు జట్టి కావాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. లంచాల కోసం రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి పెద్దలకు కట్టబెడుతున్నారు. 
– చంద్రబాబు పాలన గురించి చెప్పుకొస్తూ..మొన్ననే మా ప్రాంతానికి తిత్లీ తుపాను వచ్చిందన్నా అని చెప్పారు. ఇప్పటికీ కూడా రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నే ఉన్నారని చెబుతున్నారు. 5 వేల ఎకరాలకు పరిహారం అందలేదని, జాబితా కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. ఎవరైనా పరిహారం గురించి అడిగితే చంద్రబాబు ఏమన్నారో తెలుసా..తోకలు కత్తిరిస్తా..బుల్డోజర్స్‌తో తొక్కిస్తానని బెదిరించారు. పచ్చచొక్కాలు ప్రజా«ధనాన్ని లూటీ చేస్తున్నారు.ఊర్లో లేని పేర్లతో పరిహారం కొల్లగొట్టారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఊర్లో లేని పేర్లకు చెక్కులు ఇచ్చారని చెబుతున్నారు. ఇటువంటి అన్యాయాలు జరుగుతుంటే ఈయన నిజంగా మంత్రేనా అని అడుగుతున్నాను.
– తిత్లీ తుపాను వచ్చినప్పుడు అక్షరాల రూ.3435 కోట్ల నష్టం వచ్చిందని చంద్రబాబు కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. అయ్యా చంద్రబాబు..ఈ నష్టంలో నీవు ఎంతిచ్చావని అడుగుతున్నాను. చంద్రబాబు ఇచ్చింది ఎంతో తెలుసా..ముష్టి వేసినట్లు రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారు. 15 శాతం కూడా ఇవ్వలేదు. ఈ పెద్ద మనిషి తుపానును ఎలా వాడుకున్నారో తెలుసా..ఏ బస్సు చూసినా, ఏ ఫ్లెక్సీ చూసినా చంద్రబాబు తుపాను బాధితులను ఎలా ఆదుకున్నారో అన్న పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. ఈయన డ్రామాలు చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా..శవాలపై చిల్లర వేరుకునే రకంగా ఉంది చంద్రబాబు తీరు.
– ఈ మధ్యకాలంలో ఇంకో తుపాను వచ్చింది. పెథాయ్‌ వచ్చినప్పుడు ఈయన ఎలా వ్యవహరించారో తెలుసా? తుపాను వచ్చినప్పుడు ఆందోళన చెందుతాం. మనవత్వంతో ఆలోచన చేస్తాం. చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా..దాన్ని పబ్లిసిటీకి ఎలా వాడుకోవాలో ఆలోచిస్తారు. ఈయన సముద్రాన్ని కంట్రోల్‌ చేశారట. అహంకారంతో మాట్లాడుతున్నారు. పెథాయ్‌ తుపాన్‌ను ఓడించారట..ఈ పెద్ద మనిషి చంద్రబాబు చేయనివి ఏంటీ? చెప్పనివి ఏంటి? ఎల్లోమీడియా రాయనివి ఏంటి? అని అడుగుతున్నాను. 
– చంద్రబాబు మనస్తత్వం గురించి ఓ పెద్దాయన చెప్పారు. అన్నా ప్రమాదంలో పది మంది చనిపోతే అయ్యో అంటాం. కానీ చంద్రబాబు ఆ బస్సులో 40 మంది బతికారని చెప్పుకునే రకం అని చెప్పారు. ఈ పెద్ద మనిషి ఓ స్థాయి దాటిపోయారు. దేవుడి మీద, సృష్టి మీద విజయం సాధించానని, నవరత్నాలపై విజయం సాధించానని చెబుతున్నారు. ఈయన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సిందే అంటున్నారు. ఇంతకు పెథాయ్‌ తుపాన్‌ వచ్చినప్పుడు ^è ంద్రబాబు ఎక్కడ ఉన్నారో తెలుసా అన్నా..అన్నారు. తుపాను వస్తుందని కేంద్ర సంస్థలు అన్నీ కూడా చెప్పారన్నా.. చంద్రబాబు సీఎం హోదాలో ఉండి చేయాల్సిన పనేంటన్నా..అంటే..తుపానును, ప్రజలను గాలికి వదిలి చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో పక్క రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకారం కార్యక్రమాల్లో ఉన్నారన్నా అని చెప్పారు. తన వల్లే పంట నష్టం తగ్గిందని చెబుతున్నారన్నా అని చెబుతున్నారు.
– తుపాను వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయకుండా చంద్రబాబు చేసిందేంటో తెలుసా..అధికారులకు హుకుం జారీ చేసి ఒక్క రోజులో నష్టం పరిహారం జాబితాలో అందజేయాలని ఆదేశించారు. ఈయన నిజంగా మనిషేనా అని అడుగుతున్నాను. పొలాల్లో కోసిన పంట నీళ్లలో నానితే దాన్ని పరిగణలోకి తీసుకోరట. నేలమట్టం అయితేనే స్పష్టంగా చూడరట, కౌలు రౌతులకు పరిహారం ఇవ్వమని బాధితులకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గోట్టారు.
– అన్నా..ఇలాంటి సీఎం పబ్లిసిటీ కోసం ఏమంటారో తెలుసా..ఐఎండీ కన్నా తన రియల్‌ టైం గవర్నెన్స్‌ కచ్చితంగా సమాచారం ఇచ్చిందని డబ్బాలు కొట్టుకుంటూ పంట నష్టం తక్కువ చూపించి గొప్పలు చెబుతున్నారు.
– చంద్రబాబును సూటీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. రియల్‌ టైం గవర్నెన్స్‌ ద్వారా గొప్పగా సమాచారం సేకరించానని చెబుతున్నావు..అయ్యా మీరేమైనా ఐఎండీ, ఇస్త్రో ఇచ్చినదానికంటే ప్రత్యేకంగా ఏమైనా కనిపెట్టావా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశావా? ఐఎండీ,  ఇస్త్రో కన్న రియల్‌ టైం గవర్నెన్స్‌లో సమాచారం వచ్చిందంటున్నారు. నీవేమైనా ఆకాశంలోకి ఏమైనా ప్రత్యేకంగా పంపించావా? ఇస్త్రోతో ఏమైనా ఏంవోయూలు చేయించుకున్నావా? వైయస్‌ రాజశేఖరరెడ్డి నీకంటే ముందే ఎంవోయూలు చేయించుకోలేదా? ఉచితంగా ఇస్త్రో ఇచ్చే సేవలపై చంద్రబాబు అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా? సొమ్ము ఒకడిది సోకు మరోకది మాదిరిగా చంద్రబాబు తీరు ఉంది.
– ఐఎండీ, ఇస్త్రో రిపోర్టులు ఇస్తే..వాళ్ల రిపోర్టులు మార్చి రియల్‌ టైం గవర్నెన్స్‌తో తానే రిపోర్టు కనిపెట్టానని చెబుతున్నారు. ఈయన మాటలు ఎలా ఉంటాయో తెలుసా? సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్లు తానే కనిపెట్టారట.  మన వద్ద ఉన్న కంప్యూటర్లు కూడా తానే తెచ్చారట. హైదరాబాద్‌ను తానే కట్టానని అంటారు. బ్యాడ్మింటన్‌లో సింధు బాగా ఆడుతుంది. ఆమెకు బ్యాడ్మింటన్‌ తానే నేర్పించానని చెబుతారు. మైక్రోసాప్ట్‌ సీఈవో సత్యనాదేళ్లకు కంప్యూటర్‌ తానే నేర్పించానని అంటారు.
– చంద్రబాబు జీవితంలో తనకు తానుగా చేసింది..సాధించింది  ఒక్కటి లేదు. ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటో తెలుసా? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి తానే సీఎం అన్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన టీడీపీని లాక్కుని తానే పార్టీ పెట్టానంటారు. ఈయన చేసింది ఏందంటే..  ఒకరిది లాక్కొవడం, వాడుకోవడమే. జీవితమంతా ఇదే.
– ఆర్టీజీఎస్‌ అంటే కొత్త పదమని, దాని గురించి చాలా మందికి తెలియదని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటారు. దీంతో అద్భుతాలు చేశానని చెబుతున్నారు. ఇది పెద్ద బోగస్‌ అని నీ మంత్రి లేఖ రాసింది తెలియదా? రూ. 87612 కోట్ల రుణాలు బేషరత్తుగా మాఫి చేస్తానని చెబితే ఆ రుణాలు లక్ష కోట్లకు ఎగబాకిందని రియల్‌ టైం గవర్నెన్స్‌ చెప్పింది వాస్తవం కాదా? బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు నోటీసులు ఇస్తున్నారు. వారి రుణాలు  మాఫీ చేయలేదు. మీ ఆర్టీజీఎస్‌లో కనిపించడం లేదా చంద్రబాబు?
– ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుంది చెప్పారు. ఒక్కరికైనా జాబు  ఇచ్చావా? కొడుకుకు మంత్రి పదవి ఇచ్చారు..నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఐదేళ్లు ఇవ్వాల్సింది ఎన్నికలకు మూడు నెలల ముందు పరిమితం చేశారు. కేవలం వెయ్యి రూపాయలకు కుదించారు.
– మోడల్‌ స్కూల్‌ టీచర్లు వచ్చారు. ఈ స్కూల్స్‌లో మన పిల్లలకు మెరుగైన విద్యనందించేందుకు ఏర్పాటు చేస్తే..నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని చెబితే చంద్రబాబుకు ఆర్టీజీఎస్‌లో కనిపించడం లేదా? పిల్లలకు ఫీజులు అందడం లేదు. నీకు కనిపించడం లేదా? కరెంటు చార్జీలు, పెట్రోలు డీజిల్‌ రేట్లు బాదుడే బాదుడు. ఆర్టీసీ చార్జీలు పండుగనాడు బ్లాక్‌ టికెట్లు అమ్మినట్లు అమ్ముతున్నారు. స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు బాదుడే బాదు. రేషన్‌ సరుకుల కోత సంగతి మీ ఆర్టీజీఎస్‌లో కనిపించడం లేదా? 
– ఆరోగ్యశ్రీ అన్నది ప్రజలకు మేలు చేసే పథకం..ఇవాళ చంద్రబాబు రూ.500 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేసింది నీ ఆర్టీజీఎస్‌లో కనిపించడం లేదా? మొండి గోడలతో ఇల్లు కనిపిస్తున్నాయి. అన్నా..ఇంతవరకు బిల్లులు రావడం లేదని చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో ఇళ్లు ఇవ్వరు, ఇంటి స్థలం ఇవ్వరు. అరకొరగా ఇచ్చినా జన్మభూమి కమిటీల పేరుతోలంచాలు గుంజుకుంటున్నారు. పింఛన్లు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే..ఇవన్నీ కూడా రియల్‌ టైం గవర్నెన్స్‌లో కనిపించడం లేదా? 
– సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు బెల్టుషాపుల రద్దుపై సంతకం చేశారు. ఇవాళ ఊరూరా నాలుగైదు బెల్ట్‌ షాపులు కనిపిస్తాయి. తాగడానికి మినరల్‌ వాటర్‌ లేదు. కానీ ఫోన్‌ కొడితే మద్యం ఇంటికి తెచ్చిస్తున్నారు. చంద్రబాబు చేసిన అన్యాయమైన పాలనపై ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల్లో చెప్పిన ఒక్క హమీ నెరవేర్చలేదు. హామీలు చేయకపోతే ఆ రాజకీయ నాయకులను జైల్లో పెట్టాల్సిన పని లేదా? ఇవాళ రాష్ట్రంలో మోసం, అబద్ధం, అన్యాయం, అరాచకం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఏమీ వదిలిపెట్టడం లేదు. ఎవరు ఎక్కడ పడితే అక్కడ దోచేస్తున్నారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోంది. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు సినిమా చూపిస్తున్నారు. చంద్రబాబు– కాంగ్రెస్‌ దోస్తీ అనే కొత్త సినిమా తీస్తున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు ఏమన్నారు. ఈ పార్టీ మన రాష్ట్రానికి రాగలుగుతుందా? ఎవరూ ఓటు వేయవద్దన్నారు. తన కేసులపై విచారణ జరుగుతుందన్న భయం ఉంది. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో కేసులతో పట్టుబట్టారు. మన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. సిగ్గులేకుండా కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. తనపై విచార ణ జరిగితే పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ గొడవ చేయాలట. ఇదే కాంగ్రెస్‌ పార్టీ మొన్ననే జూన్‌లో చంద్రబాబుపై ఒక పుస్తకం విడుదల చేసింది. చంద్రబాబు అంతటి అన్యాయస్తుడు ప్రపంచంలో లేడని రాహుల్‌ ఫోటో పెట్టి పుస్తకం విడుదల చేశారు. నాలుగు నెలలు గడువకముందే చంద్రబాబు కొంత వాటా ఇస్తే టీడీపీతో జట్టు కట్టింది. రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయాయో చూడండి. నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడని 2014 ఎన్నికల్లో చంద్రబాబు సీనిమా చూపించారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు వస్తుందని సినిమా చూపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినంత కాలం ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. మోడీని చంద్రబాబు పొగిడితే..చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానాలు చేసి మరీ పొగుడుతారు. నాలుగేళ్ల తరువాత బీజేపీతో విడాకులు ఇచ్చి..ఇక బీజేపీ చెడ్డదని ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారు. విభజన హామీలు కచ్చితంగా చేస్తామని చెప్పకుండా,,చూస్తామన్న కాంగ్రెస్‌తో చంద్రబాబు జత కట్టారు. ప్రత్యేక హోదా వల్లే ఉద్యోగాలు వస్తాయని తెలిసీ కూడా హోదా గురించి చట్టంలో చేర్చకపోవడం అన్యాయం కాదా? ఇలాంటి కాంగ్రెస్‌తో రెండో సినిమా చేస్తున్నారు. ఇంతకుముందు మోడీ ఉన్నారు..ఇప్పుడు రాహుల్‌ గాంధీ వస్తారు. అధికారంలోకి వస్తేనే రుణాలు మాఫీ అంటారు. ప్రత్యేక హోదా తెస్తామని అంటారు. వీళ్లందరిని నమ్మింది చాలు. మోసపోవడం చాలు. ఎవరిని కూడా నమ్మొద్దు. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబును నమ్మకండి. నాలుగో వ్యక్తి పవన్‌ కళ్యాన్‌..ఈయన చంద్రబాబు పార్ట్‌నర్‌ను కూడా నమ్మకండి. ఆ పెద్ద మనిషే నిరుడు ఎన్నికల్లో ప్రతి మీటింగ్‌లోనూ మోడీ, చంద్రబాబుతో నేను చేయిస్తానని ఓట్లు వేయించారు. వీళ్లందరూ కూడా మోసం చేశారు. వీళ్లంతా కూడా కలిసికట్టుగా మాటిచ్చి ప్రత్యేక హోదాను హత్య చేసే పథకంలో ఒకరు కత్తి ఇస్తే మరోకరు కాళ్లు చేతులు పట్టుకున్నారు. రేపు పొద్దున 25కు 25 ఎంపీలు మనమే సాధించుకుందాం. ఆ తరువాత దేశంలో ప్రధాని ఎవరు అవుతారో మనం నిర్ణయిద్దాం. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాళ్లకు కాదు..ఇస్తామని సంతకం చేసిన వారికే మద్దతిద్దాం. 
– చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఎన్నికల్లో  ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి Ðð ళ్లే పరిస్థితి  తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోని విశ్వసనీయత, నిజాయితీ వస్తుంది. ఇది జరగాలంటే జగన్‌కు మీ అందరి దీవెనలు, ఆశీస్సులు, తోడు కావాలి. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ మీటింగ్‌లో మన పిల్లల చదువుల గురించి చెబుతున్నాను. 
– మనందరి ప్రభుత్వం వచ్చాక మీ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటాను . పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు తల్లి ఖాతాలో జమా చేస్తాం . హాస్టల్‌లో ఉండి చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. మూసేసిన ప్రతి స్కూల్‌ను తెరిపిస్తానని, ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్‌మీడియం ప్రవేశపెడతాం. మెగా డీఎస్సీ పెట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇస్తున్నాను. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు తోడుగా ఉంటాను. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..


 
Back to Top