నా పోరాటం ఆగ‌దు..సంక‌ల్పం స‌డ‌ల‌దు




చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసమే తపిస్తా
విజయనగరం:  ప్ర‌జ‌ల కోసం నా పోరాటం ఆగ‌ద‌ని, సంక‌ల్పం స‌డ‌ల‌ద‌ని ఒంట్లో చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసమే తపిస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.  తాను రాజకీయంగా ఎదగడం కోసం ప్రతిపక్ష నేతను తొలగించేందుకు వెనుకాడని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు మట్టుబెట్టడానికి ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రజా సంకల్ప యాత్ర 299వ రోజు పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..


ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం..ఉదయం నుంచి వేలాది మంది నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా ఈ దుమ్ములో, నడిరోడ్డుపై నిలబడాల్సిన అవసరం లేదు. చిక్కని చిరునవ్వుతో ప్రేమానురాగాలు పంచుతున్నారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.

– మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తుండగా రైతన్నలు నా వద్దకు వచ్చి మాట్లాడారు. అన్నా..జంగావతి ప్రాజెక్టు మా ప్రాంతానికి చాలా అవసరమైన ప్రాజెక్టు అన్నా..అలాంటి ప్రాజెక్టును దశాబ్ధాలుగా పూర్తి చేయని పరిస్థితిలో నాన్నగారు అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరూ కూడా ఆలోచన చేయన్ని విధంగా రబ్బరు డ్యాంను తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కట్టారన్నా అని చెబుతా ఉంటే నిజంగా చాలా సంతోషమనిపించింది. నాన్నగారు చనిపోయిన తరువాత ఇవాళ ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకునే నాథుడు లేడన్నా.. ఇవాళ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో దేశమంతా తిరుగుతున్నాడన్నా..ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించడం లేదన్నా అంటున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రైతుల కళ్లలో సంతోషం కనిపించేది అంటున్నారు.
– అన్నా ..తోటపల్లి ప్రాజెక్టు గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదని చెప్పుకొచ్చారు. కేవలం ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు తోటపల్లి ప్రాజెక్టు గుర్తుకు వస్తుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఈ ప్రాజెక్టు గుర్తుకు వచ్చి టెంకాయ కొట్టారన్నా..తొమ్మిదేళ్లు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి యుద్ధప్రాతిపాదికన పూర్తి చేశారని చెబుతున్నారు. నాన్నగారి హయాంలో 90 శాతం పనులు పూర్తి చేస్తే..మిగిలిపోయిన ఆ పదిశాతం పనులు పూర్తి చేయలేని అధ్వాన్నమైన పాలన చూస్తున్నామంటున్నారు. ఇవాల్టికి 85 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నారని మీ అందరి తరఫున అడుగుతున్నాను. పిల్ల కాల్వలు తవ్వని కారణంగా నీరు అందడం లేదంటే ఇది అన్యాయమైన పాలన కాదా?
– అధార్‌ ఆనకట్టు ఎన్నికలకు ముందుకు గుర్తుకు వచ్చింది.. ఆ తరువాత ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు.  అన్నా ..చంద్రబాబు పుణ్యనా చెరుకు రైతులంతా నాశనమయ్యామని చెబుతున్నారు. నిజం షుగర్స్‌ను చంద్రబాబు ఎన్‌సీఏ కంపెనీకి అమ్మేశారని, ఈ కంపెనీ పట్టించుకోకపోతే ఏం తినగలుగుతామని రైతులు అంటుంటే రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడు.
– పార్వతీపురం మున్సిపాలిటీలో తాగడానికి నీరు లేని పరిస్థితి ఉంటే పట్టించుకోవడం లేదు. మూడు రోజులకు ఒకసారి నీరు వస్తుందని చెబుతున్నారు. కొద్దికాలం కిందట అదే నీళ్లు బురద నీళ్లుగా వస్తుంటే..మా పార్టీ నాయకులు ధర్నా చేస్తే అప్పుడు కానీ వీళ్లకు తట్టలేదు మంచినీరు ఇవ్వాలని..నాలుగున్నరేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
– పార్వతీపురం అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బాగా దోపిడీ చేస్తున్నారని చెబుతున్నారు. అంగన్‌వాడీ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారని, సబ్‌ స్టేషన్లో షిప్ట్‌ ఆపరేషన్‌ పోస్టులు కూడా అమ్ముకుంటున్నారని చెబుతన్నారు. 
–ఆగ్రి గోల్డు బాధితులు నా వద్దకు వచ్చి బాధపడుతుంటే నిజంగా..చంద్రబాబు పాలన చూసి నవ్వాలో , ఏడ్వాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాను. బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మోసం చేస్తోంది. ఆగ్రిగోల్డు విలువైన ఆస్తులను చంద్రబాబు, లోకేస్‌ పూర్తిగా కాజేస్తున్నారు. ఆగ్రిగోల్డు ఆస్తుల విలువలు తగ్గిస్తూ బాధితుల జీవితాలో ఆడుకుంటున్నారు. హాయ్‌లాండ్‌ విలువైన  భూములను కొల్లగొట్టేందుకు డ్రామాలాడుతున్నారు. నాలుగేళ్ల పాటు కోర్టు పర్యవేక్షణలో అదిగో..ఇదిగో అమ్ముడబోతున్నాయని చెప్పారు. ఇవాళ హాయ్‌లాండ్‌ భూములను బినామీలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో ఇవాళ జడ్జి ఏమన్నారంటే..హాయ్‌లాండ్‌ ఎండీని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. గవర్నమెంట్‌ ప్రాసిక్యూటర్‌ మాత్రం అతడు నిందితుడు కాడు కాబట్టి అరెస్టు చేయలేదని చెబుతున్నారు. నిజంగా ఇంత వరకు అరెస్టు చేయలేదంటే ఆ ఆస్తులు తప్పించేందుకు సీఐడీ అధికారులు, చంద్రబాబు ఏ స్థాయిలో పన్నాగం పన్నారో ఇంతకన్నా నిదర్శనం ఉండదు.
– రాష్ట్రం మొత్తం కరువు కటకాలతో  అల్లాడుతోంది. రాష్ట్రంలో ఇవాళ 35.3 శాతం లోటు వర్షపాతం నమోదు అయ్యింది. ఏడు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రాయలసీమలో మైనస్‌ 50 శాతం లోటు వర్షపాతం నమోదు అయ్యింది. చంద్రబాబు చేస్తున్న పని ఏంటో తెలుసా? చంద్రబాబు కేవలం నాలుగు మండలాలు మాత్రమే కరువు అంటున్నారు. రాష్ట్రంలో 320 మండలాల్లో మాత్రమే కరువు ఉందట. చంద్రబాబు చెబుతున్న లెక్కలు ఒకవైపు ఉంటే..కరువు కారణంగా రైతులు నష్టపోయారని ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.2 వేల కోట్లు ఇవ్వాలి. ఇందులో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? కరువు వచ్చిందంటే ప్రజలంతా కూడా ప్రభుత్వం వైపు చూస్తారు. రైతులకు రుణాలు రీ షెడ్యూల్‌ కాలేదు. రైతు రుణాల్లో వడ్డీ మినహాయింపు కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గడ్డి తింటున్నావని అడుగుతున్నాను.
– చంద్రబాబు మాట్లాడితే చాలు..రెయిన్‌ గన్లతో కరువును తోలేసా అంటున్నారు. పట్టిసీమ నుంచి నీరు తెచ్చానంటున్నారు. అయ్యా చంద్రబాబు నీ రెయిన్‌ గన్లు ఏమయ్యాయి. పట్టిసీమ నీళ్లు ఏమయ్యాయని అడుతున్నాను. కరువు నీకు కనిపించడం లేదా అని అడుగుతున్నాను.
– రాష్ట్రానికి  వరప్రసాదిని అయిన పోలవరం పరిస్థితి ఒక్కసారి గమనించండి. పునాది గోడలు మాత్రమే చంద్రబాబు కట్టి పోలవరం పూర్తి చేసినట్లు ఫోజులు ఇస్తున్నారు. ఆ ప్రాజెక్టుకు ఆయనతో పాటు మనవడిని కూడా తీసుకెళ్తారు. సోమవారం పోలవరం అంటున్నారు. ఎక్కడైనా కనిపించిందా? పోలవరం ప్రాజెక్టును లంచాలమయం చేశాడు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి, సబ్‌ కాంట్రాక్టులు ఇస్తున్నారు. కేబినెట్‌ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు సబ్‌ కాంట్రాక్ట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల వస్తున్నాయని ఈ మూడు నెలల కాలంలో ప్రజలను ఎలా చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం గుర్తుకు వచ్చింది. ఈ ప్రాజెక్టులోని కుడి కాల్వలో 90 శాతం పూర్తి చేశారు. ఎడమ కాల్వలో 51 శాతం పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయలేని అధ్వాన పరిస్థితి నెలకొంది. మహానేత చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి చంద్రబాబు మళ్లీ టెంకాయ కొడుతున్నారు.
– చంద్రబాబు పాలన ఒక్కసారి చూడండి. 2014 ఎన్నికలకు ముందు రాజధాని గ్రాఫిక్స్‌ చూపించారు. ఎన్నికలు అయిపోయాయి..2019 ఎన్నికలు కూడా రాబోతున్నాయి. చంద్రబాబు ఇంకా మనకు గ్రాఫిక్స్‌ చూపిస్తునే ఉన్నారు. ఒక రోజు బహుబలి సెట్టింగ్స్‌ అంటారు. మరో రోజు సింగపూర్‌ సెట్టింగ్‌ అంటారు. మరో రోజు లండన్‌ అంటారు. నాలుగున్నరేళ్లలో పర్మినెంట్‌ పేరుతో  ఒక్క ఇటుక కూడా పడలేదు. మనకు మాత్రం గ్రాఫిక్స్‌తో సినిమా చూపిస్తున్నారు.
– చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కసారి చూడండి. రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ అన్నారు. ఎన్నికలు అయిపోయాయి. మీ రుణాలు మాఫీ అయ్యాయా? లేదు...లేదు..రుణాలు మాఫీ కాలేదు. కానీ రోజుకో సినిమా చూపిస్తున్నారు. రైతులు కేరింతలు కొడుతున్నారని చెబుతారు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఆనందంతో  ఉన్నారని సినిమాలు చూపిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. కానీ చంద్రబాబు దళారులకు నాయకుడయ్యాడు. హెరిటేజ్‌ అనే తన సొంత కంపెనీ లాభాల కోసం రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి దాన్ని ప్యాక్‌ చేసి మూడు, నాలుగు రేట్లకు అమ్ముతున్నారు. 
– చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవు..నిరుద్యోగ బృతీ రాదు. రాష్ట్రంలో కోటి 70 లక్షల  ఇళ్లు ఉంటే..ఈ పెద్ద మనిషి కేవలం  రెండు లక్షల తొంబై వేల మందికి కేవలం రూ.1000  ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఎన్నిలకు కేవలం మూడు నెలల మాత్రమే నిరుద్యోగ భృతి ఇ స్తున్నారు.
– కాంట్రాక్టర్లు నుంచి మొదలు ఇసుక, మట్టి, బొగ్గు, గుడి భూములు కూడా వదలకుండా దోచేస్తున్నారు. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్, డీజీల్‌ రేట్లు బాధుడే బాదుడు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు. స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు ఇలా అన్నింటా బాదుడే బాదుడు.
– చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తుంగలో తొక్కారు. పేదవారి నుంచి మంచి చదువులు చదవాలంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వరం లాంటిది. ఈ పథకాన్ని మహానేత ప్రవేశపెడితే దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. చంద్రబాబు ఏడాదికి కేవలం రూ.30 వేలు  ఇస్తున్నారు. అది కూడా ఏడాది నుంచి ఇవ్వడం లేదట. ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి కావాలంటే నాలుగేళ్లలో రూ.3 లక్షలు అప్పులు చేస్తే తప్ప పిల్లలను చదివించలేదని పరిస్థితి.
– ఆరోగ్యశ్రీ ఇవాళ పడకేసింది. వైద్యం చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చులు వస్తున్నాయి. నాడు 108కు ఫోన్‌ చేస్తే కుయ్‌..కుయ్‌ అంటూ వచ్చేది. ఇవాళ వస్తుందో రాదో తెలియదు
– ఇవాళ రేషన్‌ షాపుకు వెళ్తే బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. గతంలో రేషన్‌ షాపుల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, కారం, ఉప్పు, పసుపు, కిరోసిన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. అందులో కూడా వేళిముద్రలు పడటం లేదని కోత పెట్టారు.
– పింఛన్, రేషన్‌కార్డు, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. చంద్రబాబు హయాంలో ఆయన చేసిందేంటో తెలుసా..గ్రామ గ్రామంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు. ప్రభుత్వ పథకాలు రావాలంటే మీరు ఏ పార్టీ వారు అని అడుగుతున్నారు. 
– చంద్రబాబు పాలనలో ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పిల్లలు మందు తాగి పిల్లలు చెడిపోతున్నారని చంద్రబాబు అంటారు. ఇవాళ వీధికి రెండు బెల్టుషాపులు ఉన్నాయి. ఇంటి పక్కనే, గుడి పక్కన, బడి పక్కనే బెల్టుషాపులు ఉన్నాయి. మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ, మందు షాపు లేని గ్రామం లేదు. 
–  ఇంతటి వైఫల్యాలు జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు మన రాష్ట్రంలో కనిపించడం లేదు. వేరే రాష్ట్రంలో వేరే ముఖ్యమంత్రితో కనిపిస్తారు. ఈ మద్య చంద్రబాబు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్‌తో పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఆయన ఏమంటున్నారో తెలుసా..మోడీపై యుద్ధం అంటారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ గురించి ఏమన్నారో తెలుసా..కాంగ్రెస్‌ దేశానికి హాని అన్నారు. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ రక్షణ అంటున్నారు. ఆ నాడు సోనియాను దెయ్యం అన్నారు. ఇవాళ దేవత అంటున్నారు. ఆనకొండ అన్నారు. ఇవాళ ఆనందాల కొండ అన్నారు. ఇంతకుముందు రాహుల్‌గాంధీ మొద్దబ్బాయి..ఇవాళ అదే రాహుల్‌ గాంధీ మేధావట. నాడేమో జగన్‌కు ఓటు వేస్తే కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే అన్నారు. ఈ నాడు జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లు అట. ఈ పెద్దమనిషి చంద్రబాబు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపిఏ కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలను చంద్రబాబు కలిస్తున్నారు. వీరందరిని కొత్తగా తయారు చేస్తున్నట్లు ఫోజులిస్తున్నారు. కొత్తగా చంద్రబాబు అంటున్నారు..మోడీ పాలనతో విసుకెక్కి ధర్మ పోరాట యుద్ధం చేస్తున్నారట. ఆ ధర్మ పోరాటానికి జాతీయ పార్టీలను తీసుకువస్తారట. వాళ్లు వస్తారట. మీ అందరి తరఫునఅడుగుతున్నా..చంద్రబాబు పిలిస్తే గంగిరెద్దుల వచ్చే ఆ జాతీయ పార్టీలను అడుగుతున్నాను. అయ్యా..ఇదే జాతీయ పార్టీలు రాష్ట్రంలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షలకు వస్తామంటున్నారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను 23 మందిని సంతలో పశువుల్లా కొన్నారు. ఇదేనా ధర్మ పోరాటం అని అడుగుతున్నాను. ఇదే రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరగని విధంగా చంద్రబాబు కేబినెట్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. వాళ్లను భర్తరఫ్‌ చేయకుండా మంత్రులుగా కొనసాగిస్తుంటే ఏ సిగ్గు లేకుండా వస్తున్నారని అడుగుతున్నాను.
–  చంద్రబాబు సిద్ధాంతం ఏంటో తెలుసా..తిట్టిన నోటితేనే పొగడటం. ఏ స్థాయిలో సిద్ధాంతాలు ఉన్నాయని చూస్తే..ఇటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడని అనుకుంటేనే బాధనిపిస్తుంది. తాను రాజకీయంగా ఎదగడం కోసం రాజకీయంగా ఎవరైనా పోటిలో ఉంటే ప్రతిపక్ష నాయకుడైనా సరే తొలగించుకునేందుకు ఏమాత్రం కూడా వెనుకాడని మనస్తత్వం చంద్రబాబుది. అయ్యా చంద్రబాబు ..ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ చేసిన తప్పేంటి అని అడుగుతున్నాను. నీ అన్యాయమైన పాలనపై ప్రజల తరఫున నిలబడి అడిగినందుకా ? 
– చంద్రబాబును సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అక్టోబర్‌ 25న నాపై జరిగిన హత్యాయత్నంలో మీ గుట్టులో భాగంగా జరగలేదా? అయ్యా..ఇది కుట్ర కదా అని అడుగుతున్నారు. నవంబర్‌ 6, 2017న ప్రారంభమై మార్చి నాటికి ప్రభంజనంగా మారింది. మార్చిలో ఎన్నికలు రాబోతున్నాయని సంకేతాలు వస్తున్నాయి. ఆ లోగా నన్ను లేకుండా చేసేందుకు కుట్రలు చేశారు. మార్చి మాసంలోనే చంద్రబాబు కేంద్ర కేబినేట్‌ నుంచి వైదోలిగారు. మార్చి 22న ఆపరేషన్‌ గరుడ అని తెరపైకి తెచ్చారు. ఒక సినీ నటుడుని తీసుకువచ్చారు. ఆ యాక్టర్‌కు ఒక మీడియాను కూడా జత కలిపారు. ఆయనకు శిక్షణ ఇచ్చి..ప్రెస్‌మీట్‌ పెట్టించి ఎల్లో మీడియాలో విఫరీతంగా ప్రచారం చేశారు. ప్రతిపక్ష నాయకుడు చనిపోతే ఎయిర్‌ పోర్టు భద్రత చంద్రబాబు పరిధిలో లేదు అని వేరే వారిపై నెట్టే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ హత్యాయత్నం విఫలమైతే అది ప్రతిపక్షం పనే అని చెప్పేశారు. ఈ రెస్టారెంట్‌ టీడీపీ నేత హర్షవర్ధన్‌ది. ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న వ్యక్తి కత్తులు తీసుకొని వీఐపీ లాంజ్‌లోకి వచ్చారు. ఇది కుట్ర కాదా? హత్యాయత్నం జరిగిన గంటకు ముందే చంద్రబాబు స్క్రిప్ట్‌ తీసుకొని డీజీపీ, హోంమంత్రి , టీడీపీ మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఆ నిందితుడు వైయస్‌ జగన్‌ అభిమాని అంటారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత గొప్పగా పరిపాలన చేయాలనుకున్న వ్యక్తి జగన్‌ను ఎలా చంపుతారు చంద్రబాబు?
ఇదే చంద్రబాబు ఘటన జరిగిన వెంటనే తప్పుడు ఆరోపణలు చేయిస్తారు. ఫ్లేక్సీలో కూడా పైభాగంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి, విజయమ్మ ఫొటో, షర్మిలమ్మ ఫొటో ఉండదు. ఆ ఫ్లెక్సీలో గరుడ పక్షి ఫోటో ఉంటుంది. నిందితుడి దగ్గర నుంచి సీఏఎస్‌ అధికారులు ఆ వ్యక్తిని వెతికితే ఎలాంటి లెటర్‌ కనిపించలేదు. కానీ డీజీపీ అంటారు. ఒక లేఖ ఉందని మాట్లాడుతారు. కానీ ఆ లేఖ మాత్రం వెంటనే విడుదల చేయడు. ఆ లేఖ పది గంటల తరువాత విడుదల చేశారు. అందులో రెండు మూడు రకాల చేతిరాతలు ఉంటాయి. ఆ లెటర్‌ మీద మడతలు కూడా ఉండవు. ఇస్తి్ర చేసినట్లు ఉంటుంది. ఇవన్నీ కూడా కుట్రలుగా కనిపించడం లేదా? 
– విశాఖ జిల్లాలో ఆగస్టు నెలలో అడుగుపెట్టాను. ఎయిర్‌ పోర్టులో సీసీ కెమెరాలు ఆగిపోయాయి. మూడు నెలల నుంచి ఆగిపోయి ఉన్నాయని ఇవాళ చంద్రబాబు మనుషులు చెబుతున్నారు. చంద్రబాబు చేసిన అత్యంత హేయమైన పని ఏంటో తెలుసా? ఈ పెద్ద మనిషి తాను కుట్ర చేస్తాడు..ఆ కుట్ర మా  అమ్మ, చెల్లి చేసిందని వాళ్లపై నెపం నెట్టుతారు. ఒక అమ్మను, చెల్లిని ఈ స్థాయికి చేర్చారంటే ఈయన నిజంగా మనిషేనా? ఎవరిపై కూడా నేను అబంఢాలు వేయలేదు. హత్యాయత్నం జరిగిన వెంటనే డ్రామాలు చేయలేదు. రక్తంతో తడిసిన చొక్కా కూడా మార్చుకున్నారు. సంయమనంతో ఒక ట్వీట్‌ కూడా చేయమని చెప్పాను. ఆ కత్తికి ఏమైనా విషం ఉంటుందోనని హైదరాబాద్‌లో మెరుగైన పరిస్థితి ఉంటుందని నేరుగా విమానం ఎక్కి హైదరాబాద్‌కు వెళ్లాను. ఈ విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేశారు. చంద్రబాబు ఏకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి నేరుగా నేను ఆసుపత్రికి వెళ్లలేదట. ఇంటికి వెళ్తే ఆ తరువాత బీజేపీ వాళ్లు ఫోన్‌ చేస్తే ఆసుపత్రికి వెళ్లానట. నాకున్న సెక్యురిటీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. వాళ్లంతా ఉన్నారు..ఆ సంగతి నీకు తెలియదా చంద్రబాబు? కుట్రను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వుతారు. హత్యను తప్పుదోవ పట్టించేందుకు ఈయనే విచారణ చేయిస్తారు. చివరగా ఒకే ఒక మాట అడుగుతున్నాను. ఎయిర్‌పోర్టులో నాపై హత్యాయత్నం చేయించకపోతే స్వతంత్య్ర దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నావు. కేవలం కాంగ్రెస్‌తో ఒక్క మాటతో విభేదిస్తే..ఆ రోజు కాంగ్రెస్‌తో కలిసి సీబీఐ కేసులు వేయించారు. ఈ రోజు రాష్ట్రంలో సీబీఐ వద్దు అంటున్నావు. రాష్ట్రంలో సీబీఐ వద్దు అని జీవో కూడా విడుదల చేశావు. రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాల విషయంలో, చివరకు అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయినా కూడా మభ్యపెట్టేందుకు మోడీపై యుద్ధం కింద చిత్రీకరిస్తున్నావు. ఇంతకన్నా అన్యాయమైన రాజకీయ నాయకుడు, భ్రష్టుపట్టిన నాయకుడు దేశంలో మరొకరు ఉండరు. 
– ఆశా వర్కర్ల గురించి చంద్రబాబు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ల జీతాలు పెంచుతున్నారట. తెలంగాణ ప్రభుత్వం పెంచినంత కూడా పెంచకుండా, వారితో పుట్టే ప్రతి బిడ్డకు చంద్రబాబు గురించి చెప్పాలట. బిడ్డకు జన్మనిచ్చే ప్రతి తల్లి కూడా నీ గురించి చెబుతారు. నీ కంటే పెద్ద రాక్షçసుడు ఉండరని చెబుతారు. నీ పాలన రెట్టింపు రాక్షస పాలన అని చెబుతారు. చంద్రబాబు లాంటి దుష్ట శక్తులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం నా పోరాటం ఎన్నటికి ఆగిపోదు. నా సంకల్ప సడలిపోదు. నా ఒంట్లో చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసమే తపిస్తానని చెబుతున్నాను. చంద్రబాబు..నీకు, నాకు ఉన్న తేడాలు చెబుతున్నాను. చంద్రబాబు నీవు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోని డబ్బులు ఎలా సంపాదించాలని ఆశతో ఉన్నావు. డబ్బులంటే నాకు వ్యామోహం లేదు. నేను ముఖ్యమంత్రి స్థానంలోకి రావాలనుకుంటున్నది ఎందుకో తెలుసా? ఒక్కసారి ఆ స్థానంలోకి వస్తే ప్రజలకు ఎంతగా మంచి చేయాలని ఆలోచిస్తా..ఆ మంచిని చూసి 30 సంవత్సరాల పాటు ప్రజల గుండెల్లో ఉండాలని, నేను చనిపోయిన తరువాత ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో ఉండాలన్నదే నా ఆశ. ఇది చంద్రబాబు నీకు, నాకు మధ్య ఉన్న తేడా. 
–  ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. నిజాయితీ, విశ్వసనీయత రావాలి. ఇది జరగాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి, ఆశీస్సులు కావాలి. ఇవాళ ఈ కుట్ర కోణం గురించి మాట్లాడటంతో నా మనసు కూడా కలత చెందింది. నాపై ప్రేమానురాగాలు చూపిన మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ..సెలవు తీసుకుంటున్నా.. 


 
వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు
–ఝంజావతి ప్రాజెక్టును దశాబ్దాలుగా పూర్తి చేయలేదు..
–వైయస్‌ఆర్‌ వచ్చిన తర్వాత ప్రాజెక్టును కట్టే ప్రయత్నం చేశారు..
–వైయస్‌ఆర్‌ మరణానంతరం ఝంజావతి ప్రాజెక్టును పట్టించుకునేవారే లేరు..
–ఝంజావతి పూర్తయి ఉంటే 25వేల ఎకరాలకు నీరందేది..
–తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో తోటపల్లి ప్రాజెక్టును కట్టాలనుకోలేదు..
–ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు రైతులు గుర్తుకువస్తారా..
–లక్షా 65 వేల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టు తోటపల్లి..85వేల ఎకరాలకు కూడా నీరందడంలేదు.
–నాలుగున్నరేళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు..?
–చంద్రబాబు వల్ల చెరకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు..
–చెరకు రైతులకు రూ.12 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది..
–పార్వతీపురం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉంది..
–తాగునీరు మూడురోజులకు ఒక్కసారి వస్తున్నాయి.
–ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు కూడా అమ్ముకుంటున్నారు.
–అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం మోసం చేస్తోంది..
–అగ్రిగోల్డ్‌  ఆస్తులను ప్రభుత్వం పెద్దలు కాజేస్తున్నారు..
–అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువలు తగ్గిస్తూ బాధితుల జీవితాలతో ఆడుకుంటున్నారు..
–అగ్రిగోల్డ్‌ ఆస్తులను బినామీలకు అమ్ముకుంటున్నారు..
–హాయ్‌ల్యాండ్‌ ఎంపీ నిందితుడిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు..?
–రాష్ట్రం మొత్తం కరవుకాటకాలతో అల్లాడుతోంది..
–గుంటూరు నుంచి అనంతపురం వరుకు 7 జిల్లాల పరిస్థితి ఉంది..
–విజయనగరం జిల్లాలో 26 మండలాలు కరువు మండలాలు
–రాష్ట్రంలో 507 మండలాలు తీవ్ర కరవుతో అల్లాడిపోతున్నాయి.
–విజయనగరం జిల్లాలో 4 మండలాల్లోనే కరవు ఉందట..
–రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇవ్వలేదు..
–రుణాలు రీ షెడ్యూల్‌ చేయలేదు..
–చంద్రబాబూ ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నావు..
–రెయిన్‌ గన్‌లతో కరువు తోడేశానని చంద్రబాబు అన్నారు..
–పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చానని ఊదరగొట్టారు..
–ఉత్తరాంధ్రలో సుజల స్రవంతికి శంకుస్థాపనట..?
–నాలుగున్నరేళ్లు చంద్రబాబుకు సుజల స్రవంతి గుర్తుకురాలేదా.?
–ఎన్నికలు వచ్చినప్పుడే ప్రాజెక్టుకు గుర్తుకువచ్చాయా,,?
–2014 ఎన్నికల ముందు రాజధాని గ్రాఫిక్స్‌ చూపించారు..
–ఇప్పటికీ చంద్రబాబు అదే గ్రాఫిక్స్‌ చూపిస్తేనే ఉన్నారు..
–పర్మినెంట్‌ పేరుతో ఇప్పటి వరుకు ఒక్క ఇటుక కూడా వేయలేదు..
–మనకు మాత్రం రాజధాని పేరుతో సిన్మాలు చూపిస్తూనే ఉన్నారు...
–ఎవరికైనా రుణమాఫీ జరిగిందా..?
–ముఖ్యమంత్రే దళారీగా మారితే..దళారీ వ్యవస్థను కట్టడి చేసేదెవరు..
–నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలు లేవు..నిరుద్యోగ భృతీ లేదు..
–టీడీపీ పాలనలో ఇంటిపన్నులు, ఫీజులు అన్నీ బాదుడే...
–ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా పాతరేశారు..
–ఇళ్లు అమ్ముకుంటే గానీ పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఉంది..
–108 అంబులెన్స్‌లు ఫోన్‌ చేసిన 20 నిముషాలకు కూడా రావడంలేదు..
–రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడంలేదు..
–ఇంట్లో ఆరుగురు మంది ఇద్దరికి కటింగ్‌ పెడుతున్నారు..
–వేలిముద్రలు పడలేదని సాకులు చూపి రేషన్‌కు కోత పెడుతున్నారు..
–గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీ మాఫియాలను తయారుచేశారు..
–ప్రతి గ్రామంలో వీధికి రెండు బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయి..
–ముందే షాపులేని గ్రామమే కనిపించడం లేదు..
–చంద్రబాబు కాంగ్రెస్‌ను కొత్తగా పెళ్లి చేసుకున్నారు..
–2014 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ దేశానికి హాని అన్నారు..
–ఇప్పుడు కాంగ్రెస్‌ దేశానికి రక్ష అంటున్నారు..
–2014లో ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లే అన్నారు..
–నేడు జగన్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అంటున్నారు..
–యూపీఏ కూటమిలోని పార్టీలకు చంద్రబాబు కలుస్తున్నారు..
–బీజేపీ వ్యతిరేక కూటమిని తయారుచేస్తున్నారని ఫోజులిస్తున్నారు..
–నాపై జరిగిన హత్యాయత్నం మీ కుట్రలో భాగం కాదా..?
–ఇది కుట్ర కాదని మీరు ఎలా చెప్పగలరు..?
–నవంబర్‌ 6న పాదయాత్ర ప్రారంభమైంది..
–మార్చి నాటికి నా పాదయాత్ర మహోన్నత రూపం దాల్చింది..
–నారాసుర పాలనకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని సంకేతాలు రావడంతో నన్ను అంతం చేసేందుకు కుట్రపన్నారు..
–మార్చి 8న చంద్రబాబు కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగారు..
–మార్చి 22న చంద్రబాబు ఆపరేషన్‌ గరుడను తెరపైకి తెచ్చారు..
–ఆపరేషన్‌ గరుడ అని ఒక సినీ నటుడితో చెప్పించారు..
–సినిమా నటుడికి ట్రైనింగ్‌ ఇచ్చి స్క్రిప్ట్‌ చదివించారు..
–హత్యాయత్నం విఫలమయితే ఆపరేషన్‌ గరుడ అని చెప్పవచ్చని కుట్ర పన్నడం నిజం కాదా..?
–ఎయిర్‌పోర్టులో కత్తులు వచ్చింది నిజం కాదా..?







 
Back to Top