217వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైయ‌స్‌ జగన్‌ శనివారం ఉదయం కాకినాడ జేన్‌టీయూ సెంటర్‌ నుంచి అశేష ప్రజానీకం మధ్య 217 రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నాగమల్లి తోట జంక్షన్‌​, సర్పవరం జంక్షన్‌ మీదుగా ఏపీఐఐసీ కాలనీకు పాదయాత్ర చేరుకుంటుంది.  అనంతరం జననేత మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి అచ్చంపేట జంక్షన్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానిక మత్స్యకారుల సమస్యలు అడిగి వైయ‌స్‌ జగన్‌ తెలుసుకుంటారు.   

Back to Top