<br/><br/>శ్రీకాకుళం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 332వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. శనివారం ఉదయం వైయస్ జగన్ పాతపట్నం నియోజకవర్గంలోని మేళియపుట్టి మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దమాడి స్కూల్, హేరాపురం, పెద్దమాడి గ్రామం, చీపురుపల్లి వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పలాస నియోజకవర్గంలోని పాయాత్ర ప్రవేశిస్తుంది. పలాస మండలం రెగులపాడు, టెక్కలిపట్నం, మోదుగులపుట్టి, ఉద్రుకుండియా క్రాస్ వరకు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది.