క్రిష్ణాపురం నుంచి 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 

 శ్రీకాకుళం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 320వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం క్రిష్ణాపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పురుషోత్తపురం క్రాస్‌, మెట్టక్కివలస క్రాస్‌, ఊసవాని పేట, రెడ్డిపేట క్రాస్‌, కొత్తవాని పేట, భైరవాని పేట మీదుగా నక్కపేట క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. 

రాజ‌న్న బిడ్డ‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. 


Back to Top