<br/> శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 313వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం సంతవురిటి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరుకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.<br/>అక్కడి నుంచి రాపాక జంక్షన్, ఎరుకలపేట క్రాస్, కృష్ణాపురం మీదుగా రెడ్డి పేట వరకు నేడు పాదయాత్ర సాగనుంది. తమ సమస్యలను పరిష్కారించడానికి వస్తున్న జగనన్నను చూడడానికి ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైయస్ జగన్ పాదయాత్ర అశేష ప్రజానీకం అపూర్వ ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. <br/><br/>