<br/><br/><br/><br/> విజయనగరం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూంది. జననేత ఆదివారం ఉదయం విజయనగరంలోని గుర్ల మండలం నుంచి 280వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని కెల్ల మీదుగా రెల్లి పేట, గుర్ల వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం గుర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.