గండిగుండం నుంచి 268వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం 


 విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని గండిగుండం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గండిగుండం కాలనీ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. తర్వాత జననేత పాదయాత్ర పెందుర్తి నియోజకర్గంలోకి ప్రవేశిస్తుంది. నియోజకవర్గంలోని అక్కిరెడ్డి పాలెం, జుట్టాడ క్రాస్‌ మీదుగా పాత్రులునగర్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రాయవరపువాని పాలెం మీదుగా సారిపల్లి వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. 


Back to Top