జననేత డైరీ స్ఫూర్తిదాయకం..

వైయస్‌ జగన్‌ పాదయాత్ర డైరీని సేకరించిన అక్కాచెల్లెళ్లు

శ్రీకాకుళం:అభిమానం ముందు దూరం చేరువవుతోంది.కష్టం కూడా ఇష్టమవుతోంది.దీనిని రుజువు చేశారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు విమల,నిర్మల. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిశారు. ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి వైయస్‌ జగన్‌ రాసే డైరీని సేకరించి ఆయనకు బహుమతిగా అందించారు. వైయస్‌ జగన్‌ అంటే ఎంతో అభిమానమని, ఆయన ముఖ్యమంత్రి కావాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నామన్నారు.జననేత కోసం ప్రత్యేక కవిత రాశారు.

వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాల పథకాలు అద్భుతమన్నారు.అవన్నీ ఖచ్చితంగా వైయస్‌ జగన్‌ నెరవేరుస్తారన్నారు.మహిళలకు 40 సంవత్సరాలు వచ్చేసరికి పెన్షన్‌ ఇస్తామని నవరత్నాల్లో ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.జననేత డైరీ స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై రాసిన కవితను చదివివినిపించారు. ‘‘రాజశేఖరుడి ఆత్మసాక్షిగా 2017 నవంబర్‌ 6న పాదయాత్ర ప్రారంభించి

మొదటిగా కరుణమయడివై కదిలావు కడప జిల్లా నుంచి..కారణజన్ముడివై కదిలావు కర్నూలు జిల్లా నుంచి..అనంతమైన ఆశలనిస్తూ కదిలావు అనంతపురం జిల్లా నుంచి..చిరునవ్వుల చిందిస్తూ కదిలావు చిత్తూరు జిల్లా నుంచి..నమ్మకాన్ని కలిగిస్తూ కదిలావు నెల్లూరు జిల్లా నుంచి..ప్రకాశమానమై ప్రకాశిస్తూ కదిలావు ప్రకాశం జిల్లా నుంచి..గాఢమైన నమ్మకాన్ని ఇస్తూ కదిలావు గుంటూరు జిల్లా నుంచి..కృష్ణా నదిలా ఉరకలేస్తూ కదిలావు కృష్ణా జిల్లా నుంచి..పచ్చనిపైరులని పలకరిస్తూ కదిలావు పశ్చిమగోదావరి జిల్లా నుంచి..తూర్పున ఉదయించిన సూర్యుడిలా కదిలావు తూర్పుగోదావరి జిల్లా నుంచి..విశాలమైన మనసును కలిగి కదిలావు విశాఖ జిల్లా నుంచి..విజయడవువై కదిలావు విజయనగరం జిల్లా నుంచి.

శ్రీకారం చుట్టి కదిలావు శ్రీకాకుళం జిల్లా నుంచి..పాదయాత్రలో నీ కష్టాన్ని మరిచి..మా కష్టాన్ని తెలుసుకున్న ఓ రాజన్న బిడ్డ ఏమిచ్చి తీర్చుకోం మీ రుణం..చేస్తాం ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా..ఇదే మేమిచ్చే నిజమైన బహుమతి..’’

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top