అనంతపురం: చంద్రబాబును నమ్మి మోసపోయామని, రుణ మాఫీ జరగలేదని, అప్పులు తీరలేదని డ్వాక్రా మహిళలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ప్రజా సంకల్ప యాత్ర కందుకూరు ఎస్టీ కాలనీకి చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. వైయస్ జగన్ వస్తే మా కష్టాలు తీరుతాయని మహిళలు పేర్కొంటున్నారు. <br/>