<strong>విజయనగరంః</strong> వైయస్ జగన్‌ను కలిసి రామభద్రపురం మండలం జన్నివలస గ్రామస్తులు, విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్న మా గ్రామానికి మండల కేంద్రాన్ని కలిపే రహదారి లేదని వైయస్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. రోడ్లు లేక రోగులు,విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కలెక్టర్,మంత్రికి అనేకసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదన్నారు. వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. రెండు మండల కేంద్రాలకు మ««ధ్యన కూతవేటు దూరంలో ఉన్న జన్నివలస గ్రామానికి కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సుజయ కృష్ణ రంగారావు మంత్రి పదవి చేపట్టి రెండేళ్లు అవుతున్నా అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్నివసల గ్రామానికి అనుకుని ఏడు గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయన్నారు.రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామానికి అన్ని సదుపాయాలు కల్పించడంతో బాటు రోడ్లు వేయిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారని తెలిపారు.<br/><br/>