<strong>విజయనగరంః </strong> ప్రజా సంకల్పయాత్రలో జగపతినగరం నియోజకవర్గం మెంటాడ మండలం కుంటివలస మహిళలు తమ సమస్యలను జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. ఉపాధిలేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు ఇవ్వడంలేదని, ఉండేందుకు ఇళ్లు లేక పాకల్లో జీవిస్తున్నామని వాపోయారు. లోన్లు కూడా ఇవ్వడంలేదన్నారు.వైయస్ జగన్ సానుకూలంగా స్పందించి వారికి భరోసా ఇచ్చారు.