విజయవాడ: అరాచక పాలనపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వెల్లంపల్లి హెచ్చరించారు. టీడీపీ నేతల అవినీతి, అక్రమాలు రోజు రోజుకు శ్రుతి మించుతున్నాయన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దామని వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు.