<br/>శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 328వ రోజు పాదయాత్రను వైయస్ జగన్ దామోదరపురం క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రావివలస, నౌపాడ క్రాస్ మీదుగా జయకృష్ణాపురం చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తరువాత పాదయాత్ర టెక్కలి వరకు చేరుతుంది. సాయంత్రం టెక్కలి పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజన్న బిడ్డ రాకతో టెక్కలి పట్టణం పార్టీ జెండాలు, ప్లెక్సీలతో ముస్తాబు చేశారు. సభకు స్వచ్చందంగా ప్రజలు తరలివచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. <br/><strong>వైయస్ఆర్‌సీపీలోకి భారీగా టీడీపీ శ్రేణులు </strong>శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కలమట వెంకటరమణ మరదలు, టీడీపీ నాయకురాలు కలమట సుప్రియ తన అనుచరులతో కలిసి పాదయాత్రలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నేతలు కూడా పార్టీలో చేరారు. సుప్రియ మాట్లాడుతూ టీడీపీ పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదన్నారు. వైయస్ఆర్ ఆశయాల సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైయస్ జగన్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు. <br/>