సాక్షార భారత్‌ ఉద్యోగులకు అండగా ఉంటా



విజయనగరం: సాక్షార భారత్‌ ఉద్యోగులకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర 291వ రోజు సాక్షార భారత్‌ కో–ఆర్డినేటర్లు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 13 నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ అండగా ఉంటానని భరోసా కల్పించారు.
 
Back to Top