రజక వృత్తే జీవనాధారం..

వైయస్‌ జగన్‌కు గోడు చెప్పుకున్న రజకులు
విజయనగరంఃకురుపాం నియోజకవర్గం నాగూర్‌కు చెందిన రజక కుటుంబాలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. బట్టలు ఉతికేందుకు చెరువులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదని వాపోయారు.ఆర్థిక స్థోమత లేదని రజక వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రజకులను పట్టించుకోవడంలేదన్నారు.రజక కుటుంబాల్లో చదువుకున్న యువతకు ఉద్యోగాలు కూడా లేవన్నారు. ఎన్నికల ముందు రజకులను ఎస్సీలో చేరుస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ను తమ సమస్యలను సానుకూలంగా విన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువును తవ్విస్తానని హామీ ఇచ్చారన్నారు.సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారని తెలిపారు.
 
Back to Top