<br/>విశాఖః ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తాటిచెట్ల పాలెం వద్ద వైయస్ జగన్‌ను రజక సంఘం సభ్యులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తమనను ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్..మరో ఏడాది ఆగితే మనందరి ప్రభుత్వం వస్తుందని, అందరికి మేలు జరుగుతుందని భరోసా కల్పించారు.