శ్రీకాకుళం: ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్‌ను కలిసి ప్రజలు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. వచ్చేది రాజన్న రాజ్యమే అని, జననేతకు తమ సమస్యలు చెప్పుకుంటే తమ బతుకుల్లో వెలుగులు నిండుతాయని ప్రజలు భావిస్తున్నారు. కవిటి మండలం ఒంటూరు గ్రామ మహిళలు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తాగునీరు సౌకర్యం లేదని, ఐదేళ్లుగా ఇళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంతు ఒరియాలు వైయస్ జగన్ కలిసి తమ గోడు వినిపించారు. ఏళ్ల తరబడి ధ్రువీకరణ పత్రాలు కోసం పోరాడుతున్నామని తమది ఏ కులమో ప్రభుత్వం తేల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన వైయస్ జగన్ న్యాయం చేస్తామని తెలిపారు. వైయస్ జగన్‌ను కళింగపట్నం గంగపుత్రులు కలిశారు. తమకు తిత్లీ తుపాను పరిహారం అందలేదని వాపోయారు. చేపల వేట కసం జెట్టి నిర్మించాలని మహిళలు వినతించారు. వైయస్ జగన్ పాదయాత్రలో వైయస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్ కడప రత్నాకర్,రఘురామిరెడ్డిలు పాల్గొన్నారు.