జననేతను కలిసిన పి.కొట్టాలపల్లె గ్రామస్తులు

అనంతపురం:  గ్రామంలో రోడ్లు లేవని, పింఛన్లు ఇవ్వడం లేదని పి.కొట్టాలపల్లి గ్రామస్తులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వర్షం వస్తే కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. 30 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేదు. మంచినీరు సరఫరా చేయడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ జగన్‌ను గ్రామస్తులు కలిశారు. తాడిపత్రికి, వడుగూరుకు రోడ్లే లేవని తెలిపారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
 
Back to Top