సరిహద్దు ప్రాంతంలో సమస్యల వెల్లువ



–  వైయస్‌ జగన్‌ను కలిసిన ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు
– అండగా ఉంటానని జననేత వైయస్‌ జగన్‌ హామీ
విజయనగరం:  ఆంధ్ర– ఒడిశా సరిహద్దు గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కనీక మౌలిక సదుపాయాలకు నోచుకోక తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ముందు వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం మక్కువ మండలం తూరుమామిడి గ్రామస్తులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. ఆంధ్ర– ఒడిశా సరిహద్దుల్లోని తూరుమామిడి గ్రామానికి  రోడ్డు కావాలని ఏళ్ల తరబడి అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్తీ్ర నిధి నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. 

వైయస్‌ జగన్‌ను కలిసిన వెంకట బైరిపురి గ్రామస్తులు
ప్రజా సంకల్ప యాత్ర 296వ రోజు వైయస్‌ జగన్‌ను వెంకట బైరిపురం గ్రామస్తులు కలిశారు. వెంగళరాయసాగర్‌ ఆధునీకీకరణ పనులు పూర్తి చేయాలని, కాల్వలకు గండ్లు పడి పూడిక పనులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆఖరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందడం లేదని ఫిర్యాదు చేశారు. వెంకటబైరిపురం, శిర్లాంతో పాటు మూడు గ్రామాల్లో పశువుల ఆసుపత్రి లేదని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని, అభివృద్ధికి బాట‌లు వేస్తాన‌ని హామీ ఇచ్చారు.
 
Back to Top