కర్నూలు: పత్తికొండ నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేవని స్థానికులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్న నియోజకవర్గంలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగు కోసం బంగారం తాకట్టు పెట్టామని తెలిపారు. మా పిల్లలు బీ టెక్ చదవి కూలీ పనులు చేసుకుంటున్నారని జననేత దృష్టికి తీసుకెళ్లారు. బిల్డింగులు లేవు, పింఛన్లు లేవు, రోడ్లు లేవు, కాల్వలు లేవని వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు.