జననేతను కలుసుకున్న ఒఎన్ జిసి కార్మికులు

తూర్పు గోదావరి జిల్లా:  ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేత వైయస్ జగన్
మోహన్ రెడ్డిని సోమవారం ఉదయం ఒఎన్ జిసి కాంట్రాక్టు కార్మికులు కలుసుకుని తమ
సమస్యలను విన్నవించుకున్నారు. ఎటువంటి కారణాలు లేకుండా 36 మందిని తొలగించారని వారు
వాపోయారు. ఓన్ ఎన్ జిసి పైర్ ఫైటర్స్ గా సంస్థలో జరిగే ప్రమాదాలతో పాటు చుట్టు
పక్కల ఎటువంటి అగ్నిప్రమాదం జరిగినా స్పందిస్తున్నామని వారు తెలిపారు.  దాదాపుగా ఇక్కడ ఒఎన్ జిసి ఏర్పాటైన నాటి నుంచి
పనిచేస్తున్నామన్నారు. తమ భూములను తీసుకుని , ప్రత్యామ్నాయంగా ఉపాథి కల్పించినట్లే
కల్పించి ఇప్పుడు  అకారణంగా తొలగించడం
ఎంతవరకు న్యాయమని వారు వైయస్ జగన్ తో వాపోయారు. 
తమ 36 మందిని తొలగించి, కేవలం నామమాత్రంగా ముగ్గురు సిబ్బందితో ఎలా
పనిచేస్తారో అర్థం కావడం లేదన్నారు. అత్యంత సున్నితమైన పెట్రోలియం ప్లాంట్ లో
ఏదైనా అనుకోని సంఘటన జరిగితే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. తమను
ఉద్యోగంలోకొనసాగించడంతోపాటు, పర్మినెంట్ చేసేలా చూడాలని వారు జననేతకు విజ్ఞప్తి
చేశారు. 

Back to Top