జననేతతో మత్స్యకారుల గోడుశ్రీకాకుళం: తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని పలువురు మత్స్యకారులు జననేతతో గోడు వెలుబుచ్చుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తమ ప్రాంతానికి వచ్చిన జననేతను నరసన్నపేట ప్రాంత మత్స్యకారులు కలుసుకుని గతంలో తుఫాను కారణంగా తమ బోట్లు దెబ్బతిన్నాయనీ, వలలు చిరిగిపోయినా ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఎక్కడా తుఫాను షెల్టర్లనేవి కనిపించడం లేదనీ, తుఫాన వస్తోందంటే తట్టాబుట్టా సర్దుకోవాల్సి వస్తోందని తమ సమస్యలను విన్నవించారు.