జేసీ వర్గీయుల అరాచ‌కాల‌కు అంతులేదు

తాడిపత్రి: జేసీ వర్గీయుల అరాచ‌కాల‌కు అంతు లేకుండా పోయింద‌ని ఇటీవల హత్యకు గురైన సింగిల్‌ విండో చైర్మన్, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులోని సాక్షులు పేర్కొన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వారు  వైయస్‌ జగన్‌ను కలుసుకునేందుకు వచ్చారు. సాక్షులు, బంధువుల పొలాలను జేసీబీలతో తొక్కిస్తూ, బోర్లు నాశనం చేస్తూ తీవ్ర ఇబ్బందులుకు గురిచేస్తున్నారని వాపోయారు. జేసీ వర్గీయుల వల్ల జీవనాధారం కోల్పోయామని వారు చెప్పారు. పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నిందితులు ధైర్యంగా తిరుగుతున్నా.. వారిని పట్టించుకోకుండా సాక్షులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. విజయభాస్కర్‌రెడ్డి కేసు రాజీ చేసుకుంటేనే ఊర్లో తిరగనిస్తామని, లేకపోతే అంతుచూస్తామని బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వైయస్‌ జగన్‌కు చెప్పేందుకు పాదయాత్రకు వచ్చామన్నారు. 
Back to Top