తుని తరలివచ్చింది

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేత 103వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌కు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళలు కోలాటాలు, హారతులతో వైయస్‌ జగన్‌ను ఆహ్వానించారు. పాదయాత్ర సాగుతున్న మార్గమంతా పండుగ వాతావరణం నెలకొంది.
Back to Top