అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టిన వైయ‌స్ జ‌గ‌న్ తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురం నియోజకవర్గంలోకి ప్ర‌వేశించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం అల్లవరం మండలంలోని బోడసకుర్రు వ‌ద్ద ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.  వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలిరావ‌డంతో దారుల‌న్నీ కిక్కిరిసిపోయాయి. జ‌నం త‌మ బాధ‌లు జ‌న‌నేత‌కు చెప్పుకొని సాంత్వ‌న పొందుతున్నారు.  ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 
Back to Top