<br/>విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు తోడుగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మత్స్యకారులు విశాఖ నగరంలో వైయస్ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వారిని చంద్రబాబు అవమానపరిచారని వైయస్ జగన్ ముందు వాపోయారు. మత్స్యకారులతో వైయస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వారు రాజన్న బిడ్డకు చేపలు బహుమతిగా ఇచ్చి, వలలతో సత్కరించారు.