తొలి అడుగు


ఇడుపులపాయ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్పం పేరుతో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఇడుపులపాయ నుంచి తొలి అడుగు పడింది. 9.47 నిమిషాలకు తొలి అడుగు వేసి పాదయాత్రను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ జగన్‌కు సంఘీభావం చెప్పేందుకు వచ్చిన అశేష జనం నడుమ ప్రజా సంకల్ప యాత్రకు అడుగులు వేశారు. అంతకు ముందుకు వైయస్‌ఆర్‌ఘాట్‌లో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరిన జననేతకు వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపి అడుగులో అడుగులు వేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అధికారంలోకి రాగానే వైయస్‌ఆర్‌ చారిత్రాత్మక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహానేత స్ఫూర్తితో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లు సాగనుంది. 
Back to Top