మన్నవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి

చిత్తూరు: మన్నవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని స్థానికులు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదని జననేత దృష్టికి తీసుకెళ్లారు.  కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మన్నవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు.
 
Back to Top