అనంతపురం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉక్కు మనిషి అని పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్ జగన్ కూడా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారన్నారు. చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రజలంతా వైయస్ జగన్ వద్దకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని చెప్పారు.