<br/><strong>జననేతతో రైతుల మొర</strong><br/><strong>శ్రీకాకుళంః</strong> వంశధార–బహుదా నది అనుసంధానానికి తవ్వే కాల్వ దిశ మార్చాలని జననేత వైయస్ జగన్‌ను కోరారు. ఈ మేరకు పలు గ్రామాల రైతులు వినతిపత్రం సమర్పించారు. కాల్వ దిశ మార్చకపోతే కొద్దిపాటి భూములున్న తము తీవ్రంగా నష్టపోతామని వాపోయారు.గ్రామాల్లో యువతకు ఉద్యోగాలు కూడా లేవని, ఉన్న ఒకటి, రెండు భూములతో కూలీపనులు చేసుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని, జననేతకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారని న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు.