పనికిరాని చెక్కులిచ్చి చేతులు దులుపుకున్నారు

పలాస: తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన  తమకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఎందుకు పనికి రానివిగానే ఉన్నాయని శ్రీరాంనగర్ కు చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేతను కలుసుకుని వారు తమ గోడు వెలిబుచ్చుకున్నారు. కేవలం నష్టపరిహారం పేరుతో కేవలం చెక్కులు ఇచ్చి ప్రభుత్వం దులుపుకుందని, కానీ వాస్తవంలో ఒక్క రూపాయి కూడా బ్యాంకులో జమ కాలేదన్నారు.  తిత్లీ తుఫాను వచ్చి రెండునెలలైనా, తమకు నేటికీ సరైన మంచినీరు లభించడంలేదనీ, ప్రభుత్వం సరఫరా చేయడం లేదని వారు వాపోయారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top