ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తోంది

జననేతను కలిసి గోడు వెల్లబోసుకున్న ఆటోడ్రైవర్లు

శ్రీకాకుళం: ఇన్సూరెన్స్, ఫైన్లు, ఫిట్‌నెస్‌ ఫీజుల పేరుతో ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తుందని, ప్రభుత్వ చర్యతో రోడ్డున పడుతున్నామని ఆటోడ్రైవర్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను కవిటి మండలంలో ఆటో డ్రైవర్లు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ దోపిడీతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని, ఆటో రోడ్డు మీద తిప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వైయస్‌ జగన్‌ చెప్పారు. వైయస్‌ జగన్‌ హామీతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top