బాబు ఆదివాసీలను మోసం చేశాడు

విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని విశాఖ ప్రాంత గిరిజనులు అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో గిరిజనులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్ధపు హామీలతో మోసం చేశారన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని, గిరిజన కార్పొరేషన్‌ ఉన్నా.. దానికి నేటికీ పాలక మండలి లేదన్నారు. చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనుగోలు చేశారన్నారు. 
Back to Top