దర్జీనగర్‌ నుంచి 251వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
విశాఖ‌ : చ‌ంద్ర‌బాబు దుష్ట ప‌రిపాల‌న‌లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. శుక్రవారం ఉదయం జననేత 251వ రోజు పాదయాత్రను దర్జీనగర్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి మామిడి పాలెం క్రాస్‌, గంధవరం, దొడ్డుపాలెం క్రాస్‌, వెంకన్న పాలెం, గోవాడ మీదుగా అంబేరు పురం, గణపతినగరం మీదుగా చోడవరం వరకు రాజన్నబిడ్డ పాదయాత్ర కొనసాగనుంది. జననేత చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 
            


తాజా ఫోటోలు

Back to Top