వైయస్‌ఆర్‌ కుటుంబంలోకి స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలు

తిరుపతి: వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి కూరగాయల మార్కెట్‌లో వైయస్‌ఆర్‌ కుటుంబం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తామని ప్రజలే అంటున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మా వ్యాపారాలన్నీ కుదేలైపోయాయని, మా జీవితాల్లో ఏ రకమైన మేలు జరగలేదని ప్రజలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల ప్రజలంతా అసహనంతో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం తప్పదని టీడీపీని హెచ్చరించారు.  

Back to Top