ఉత్సాహంగా వైయ‌స్‌ఆర్‌ కుటుంబం

పాములపాడు : ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్‌ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన వైయ‌స్‌ఆర్ కుటుంబంలోకి సభ్యులు ఉత్సాహంగా సభ్యత్వం పొందుతున్నారు. మంగళవారం మండలంలోని ఇస్కాల గ్రామంలో వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు బంగారు మౌలాలి, అంబన్న, శ్రీనువాసులుయాదవ్, ముర్తుజావలి, అలీలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా నవరత్నాల పథకాలను అమలు చేస్తార‌ని వివరించారు. ఈ పథకం అమలుతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలిపారు. 90 కుటుంబాలను వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా నమోదు చేయించారు.
===================================================
 బడుగుల సంక్షేమం కోసమే ‘‘నవరత్నాలు’’
పెద్దకడబూరు :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘‘నవరత్నాలు’’ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసమేనని ఎంపీటీసీ సభ్యుడు యల్లప్ప, వైయ‌స్‌ఆర్‌ సీపీ సేవాదళ్‌ జిల్లా కార్యదర్శి తిక్కన్న, ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి ముక్కరన్న, బూత్‌ కమిటీ కన్వీనర్‌లు సన్నక్కి అంజినెయ్య, ఈరన్న అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నతుంబళం, పెద్దకడబూరు, కంబదహాల్‌ గ్రామాలలో బూత్‌ కమిటీ సభ్యులతో వైయ‌స్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి సభ్యులను వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమం కోసం బాబు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించి పేదల సంక్షేమం గాలికి వదిలేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. మరోమారు ప్రజలు బాబు మాయమాటలు విని మోసపోకుండా బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బూత్‌ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Back to Top