రానున్న‌ది జ‌గ‌న‌న్న కాల‌మే

-పార్టీలు మారిన‌ వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు
- చంద్ర‌బాబు మోసాల మ‌నిషి
- మూడు సంవ‌త్స‌రాల పాల‌న‌లో చేసింది శూన్యం

చిత్తూరు జిల్లా(ప‌ల‌మ‌నేరు): చంద్ర‌బాబు చేత‌గాని త‌నానికి ప్ర‌జ‌లు ప‌డుతున్నబాధ‌లే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌ల‌మ‌నేరు మునిసిప‌ల్ చైర్ప‌ర్స‌న్ శార‌ద కుమార్ అన్నారు. అన్ని అర్హ‌త‌లు ఉన్నా పేద ప్ర‌జ‌ల‌కు సంక్షేమ‌ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని ఆమె అన్నారు. న‌మ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి పార్టీలు మారడం సిగ్గుచేటని ఫిరాయింపుదారులపై మండిపడ్డారు. త్వరలోనే వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న వ‌స్తుంద‌ని అంద‌రికీ మంచిరోజులు వ‌స్తాయ‌ని ఆమె అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌ల‌మ‌నేరు నియోజ‌వ‌ర్గంలో పర్యటించారు. పెన్ష‌న్ ఇప్పించాలంటూ కుప్ప‌లు తెప్ప‌లుగా ప్ర‌జ‌లు విన్న‌పాలు అందిస్తున్నార‌ని, దీనితోనే చంద్ర‌బాబు పాల‌న ఎంత ఘోరంగా ఉందో అర్థ‌మ‌వుతుందిని ఆమె అన్నారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ ప‌ల‌మ‌నేరు కోఆర్డినేట‌ర్ రెడ్డెమ్మ‌, సీవీ కుమార్, ప్ర‌కాష్, టౌన్ క‌న్వీన‌ర్ మండి సుధాక‌ర్ పార్టీ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

 అమరావతి జపంతో కాలక్షేపం
న‌ర్సీప‌ట్నం)))గుండెగుండెకు ధైర్యాన్నిస్తూ జ‌గ‌న‌న్న ప‌ిలుపు మేర‌కు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నామ‌ని పెట్లా ఉమా శంక‌ర్ గ‌ణేష్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్ఆర్ సీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం పెద‌బొడ్డేప‌ల్లి 14వార్డ్ లో ప‌ర్య‌టించారు.  చంద్ర‌బాబు పాల‌న‌లో ప్రజలు చాలా క‌ష్టాలు ప‌డుతున్నారని ఆయ‌న అన్నారు. బాబు ఎంతసేపు అమరావతి జంపం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ప్రజల బాగుగులే పట్టడం లేదని ఫైర్ అయ్యారు.

బాబుకు తగిన గుణపాఠం తప్పదు
ప్రకాశం జిల్లాః సంతనూతల పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో పెద్ద దోర్నాల మండలం గుండంచర్ల గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది.  బాబు మోసపూరిత పాలనను గడపగడపలో ఎండగట్టారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించి బాబుపాలనకు మార్కులు వేయాలని ప్రజలకు కరపత్రాలు అందించారు. ఈసందర్భంగా ప్రజలు బాబు పాలనపై దుమ్మెత్తిపోశారు.అబద్ధపు హామీలతో తమను మోసం చేసిన బాబుకు రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top