చంద్రబాబు బురిడీ మాటలు నమ్మి మోసపోయాం

నెల్లూరు

))ఎన్నికల సమయంలో చంద్రబాబు బురిడీ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎదుట వాపోయారు. కావలి పట్టణం లోని 35 వ వార్డ్ లో ఎమ్మెల్యే గడప గడప వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వ మోసపూరిత విధానాలను  వివరించారు. ప్రజలను వంచించిన చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ సీఎం అవుతారని, రానున్న కాలం మంచిగా ఉంటుందని, ప్రజల కష్టాలన్నీ తీరుతాయని రామిరెడ్డి భరోసా కల్పించారు.


తాజా వీడియోలు

Back to Top