మాకొద్దు..బాబు పాలన

కర్నూలుః గడప గడపకూ వెళుతున్న వైయస్సార్సీపీ నాయకులకు స్థానికులు తమ సమస్యల్ని వెళ్లబోసుకొంటున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు రావలసిన పింఛన్లను కత్తిరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... ఆ డబ్బులతో ప్రత్యేక విమానాలు, విదేశీ పర్యటనలు చేసుకొంటూ జల్సా చేస్తోంది. ఇటువంటి పాలన మాకొద్దంటూ ప్రజలు ఎక్కడికక్కడ తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల ఆవేదన కళ్లకు కట్టింది. 

రుణాలు మాఫీ కావడం లేదు. పింఛన్లు, రేషన్ అందడం లేదు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. ఇళ్ల ఊసేలేదు. ఎన్నికల ముందు వందలాది వాగ్ధానాలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా ఉన్నవాటిని కత్తిరిస్తున్నాడని ప్రజలు మండిపడుతున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే మన జీవితాలు బాగుపడుతాయని, మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని వైయస్సార్సీపీ శ్రేణులు ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. 

Back to Top